దుర్గామాత మండపాల్లో మారబోయిన రవి యాదవ్ ప్రత్యేక పూజలు
మాదాపూర్,మేజర్ న్యూస్ : దసరా పండుగను పురస్కరించుకుని శేరిలింగంపల్లి పరిధిలోని లింగంపల్లి , పాపిరెడ్డి కాలనీ, మసీద్‌బండ, ఆర్జీకే కాలనీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన దుర్గామాత మండపాలను బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మారబోయిన రవి యాదవ్ సందర్శించి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్న ఆయన, ప్రజలందరూ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, సిరిసంపదలు వెల్లివిరియాలని, అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని ఆకాంక్షించారు.
అనంతరం వివిధ దుర్గామాత మండపాల వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని వడ్డించారు. శరన్నవరాత్రి ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతకు ప్రతీకలుగా నిలవడమే కాకుండా ప్రజల్లో ఐక్యత, సోదరభావాన్ని పెంపొందిస్తాయని ఈ సందర్భంగా మారబోయిన రవి యాదవ్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.