BREAKING
స్టాక్ మార్కెట్లలో భారీ లాభాల జోరు నగర అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాం – మేయర్ కొలగాని శ్రీనివాస్ దక్షిణ కొరియాతో ముగిసిన ఐఎన్ఎస్ సహ్యాద్రి నౌకాదళ విన్యాసాలు ధాన్యం కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకోవాలి. జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు–2026: పోలింగ్ సిబ్బంది కేటాయింపు పూర్తి. యువ ఆపద మిత్ర శిక్షణలో శాతవాహన కామర్స్ వాలంటీర్లు పశ్చిమ బెంగాల్‌లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పోశమ్మ తల్లికి బోనం.. ఉద్యోగ భద్రత కోసం వేడుకోలు -22వ రోజుకు చేరిన NHM ఉద్యోగుల నిరవధిక సమ్మె. - ఎన్ హెచ్ ఎం జేఏసీ జిల్లా ప్రధాన కార్యదర్శి దామగట్ల కుమార్ భూసార పరిరక్షణతోనే అధిక దిగుబడులు అనూహ్యంగా ఘన విజయం సాధించిన జనసేన శిరీష పాలకొల్లును ముంచెత్తిన వర్షపు నీరు! లోతట్టు ప్రాంతాలు జలమయం.. ఇళ్లలోకి చేరిన మురుగునీరు అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం.. ప్రధాన రహదారులపై నిలిచిన మోకాళ్ల లోతు నీరు ప్రజా సౌకర్యార్థం ఆర్టీసీ స్టాప్ ఏర్పాటు చేయాలి విజయం సాధిస్తా - అభివృద్ధి చేసి చూపిస్తా జీఎం దిగుమతులకు ఎలాంటి అనుమతి లేదు: పీయూష్ గోయల్ *మట్టి ప్రమిదల వెలుగుల్లోనే అసలైన దీపావళి!*

బిజెపికి పోతుగంటి మహేష్ రాజీనామా ..

Select Suryaa Now
బిజెపికి పోతుగంటి మహేష్ రాజీనామా ..

 

తలకొండపల్లి, రంగారెడ్డి : 

మండల కేంద్రానికి చెందిన జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు పోతుగంటి మహేష్ భారతీయ జనతా పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, తన పదవులకు రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన నవంబర్ 03న బీజేపీ రాష్ట్ర, జిల్లా అధ్యక్షులకు లేఖ రాశారు. వ్యక్తిగత కారణాల రీత్యా నేను పార్టీకి, పదవులకు రాజీనామా చేస్తున్నానని మహేష్ వెల్లడించారు. తనకు  అవకాశం కల్పించిన నాయకత్వానికి, తనతో పాటు  కలిసి పనిచేసిన కార్యకర్తలకు, నాయకులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపా. తన రాజీనామాను ఆమోదించి పార్టీ సభ్యత్వం నుండి తొలగించాలని కోరుతున్నాను అని ఆయన లేఖలో పేర్కొన్నారు. తలకొండపల్లి మండలానికి చెందిన పోతుగంటి మహేష్ గత 20ఏళ్లుగా బీజేపీలో చురుకుగా పనిచేశాశని తెలిపారు. మండలంలో బీజేపీ బలంగా ఉన్న గ్రామాల్లో తలకొండపల్లి ఒకటని అలాంటి చోట నుంచే మహేష్ బయటకు వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. పోతుగంటి మహేష్ తదుపరి ఏ పార్టీలో చేరబోతున్నారు. అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉందని, ఇప్పటికే ఆ పార్టీకి చెందిన కీలక నేతలతో చర్చలు జరిపారని ఆయన అనుచర వర్గం చెబుతోంది. మరోవైపు బీఆర్ఎస్ లోకి వెళ్తారన్న ప్రచారం కూడా లేకపోలేదు. అయితే దీనిపై ఆయన ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు. మరికొన్ని రోజుల్లో ఆయన తన భవిష్యత్ కార్యాచరణను ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.