BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

**భక్తిభావంతో అమ్మవారి వీడ్కోలు శోభాయాత్ర** **కృష్ణా–గోదావరి సంగమం దిశగా లడక బజారు అమ్మవారి పయనం**

Select Suryaa Now
**భక్తిభావంతో అమ్మవారి వీడ్కోలు శోభాయాత్ర**  **కృష్ణా–గోదావరి సంగమం దిశగా లడక బజారు అమ్మవారి పయనం**

మధిర, సూర్య మేజర్ న్యూస్ 


పది రోజులపాటు పూజలందుకున్న అమ్మవారు భక్తుల జయజయధ్వానాల మధ్య నిమజ్జన యాత్రకు బయలుదేరారు. *మధిర పట్టణంలోని లడక బజారులో దేశభక్తి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవాలు బుధవారం అమ్మవారి వైభవోపేత శోభాయాత్రతో ఆధ్యాత్మిక ముగింపునకు చేరుకున్నాయి*. పూజలు, అర్చనలు, భక్తుల ప్రార్థనలతో కళకళలాడిన ఉత్సవ ప్రాంగణం అమ్మవారికి వీడ్కోలు పలుకుతూ భక్తిభావంతో నిండిపోయింది.

మంగళవాయిద్యాలు, భక్తుల నామస్మరణల మధ్య సాగిన శోభాయాత్రలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. అనంతరం ఎన్టీఆర్ జిల్లాలోని ఫెర్రి వద్ద కృష్ణా–గోదావరి నదుల సంగమ ప్రాంతంలో అమ్మవారి నిమజ్జన కార్యక్రమం నిర్వహించేందుకు యాత్ర బయలుదేరింది. భక్తుల పూజలు అందుకున్న అమ్మవారు జలప్రవాహంలో ఐక్యమయ్యే ఈ ఘట్టం ఉత్సవాలకు ఆధ్యాత్మిక పరిపూర్ణతను చేకూర్చనుంది. అమ్మవారి అనుగ్రహం సకల జనులపై ఉండాలని భక్తులు ప్రార్థించారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో దేశభక్తి యువజన సంఘం సభ్యులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

సీతారాం.. సుంకర