BREAKING
పెరిగిన బియ్యం ధరలను తక్షణమే అదుపు చేయాలి నూతన వధూవరులను ఆశీర్వదించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి నేడు ప్రజావాణి కార్యక్రమం విప్పమనుపట్టెడ సర్పంచ్ ఎన్నికలపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి గ్రామస్థుడి ఫిర్యాదు అమెరికాలో మూడో రోజు కొనసాగుతున్న విమాన ప్రయాణాల అంతరాయం విజ్ఞాన సమాజమే దేశ అభివృద్ధికి పునాది రష్యా కుట్రల నేపథ్యంలో డిసెంబర్ 1 నుండి సరిహద్దులను మూసివేయనున్న ఎస్టోనియా 16న పిల్లల ప్రజావాణి సింగపూర్, మలేషియా దేశాలకు క్షమాపణలు తెలిపిన ఇండోనేషియా అధ్యక్షుడు బాల్ బ్యాడ్మింటన్ జిల్లా అధ్యక్షులుగా గూట్ల తిరుపతి హూతీ వ్యతిరేక బలగాల వెనుకంజ, బహ్రెయిన్‌పై ఇరాన్ దాడుల కలకలం అర్హులైన ప్రతి ఒక్కరికి పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అందించడమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యం-పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి రొంపిచెర్ల సర్పంచ్ బరిలో షేక్ షబానా ఆజ్మీ. మంత్రి సీతక్కకు స్వాగతం పలికిన ఇనగాల మర్రిపాడు .సి .లో పోలీసులు పల్లెనిద్ర

బీసీల మధ్య చిచ్చు పెట్టొద్దు..! ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేరిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

Select Suryaa Now
బీసీల మధ్య చిచ్చు పెట్టొద్దు..! ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేరిస్తే రాష్ట్రవ్యాప్త ఉద్యమం

సిద్దిపేట అర్బన్,  : బీసీ కులాల మధ్య రాజకీయ విభేదాలు సృష్టిస్తూ పంచాయతీలు పెట్టడం ప్రభుత్వాలు మానుకోవాలని జాతీయ నాయకులు నడిమింటి శ్రీనివాస్ అన్నారు. ఇప్పటికే బీసీ–ఏ కేటగిరీలో ఉన్న కులాలకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన తర్వాతే ఇతర కులాల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చే విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.సిద్దిపేట జిల్లా కేంద్రంలో తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సమితి రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక మాట్లాడుతూ.. సమితి నాలుగో రాష్ట్ర మహాసభను డిసెంబర్ 13న సిద్దిపేటలో నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ మహాసభకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి రజకులు, సంఘం నాయకులు, ప్రతినిధులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారునడిమింటి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చుతామని ప్రకటించడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే బీసీ–ఏలో ఉన్న 56 కులాలకు విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో తగిన న్యాయం జరగాల్సిన అవసరం ఉందన్నారు. బీసీలకు రావాల్సిన అవకాశాలను ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ప్రభావితం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.పోటీ పరీక్షల్లో అధిక మార్కులు సాధించినప్పటికీ బీసీ అభ్యర్థులకు ఆశించిన ఉద్యోగ అవకాశాలు లభించడం లేదని, మరోవైపు తక్కువ మార్కులు సాధించిన అభ్యర్థులకు ఈడబ్ల్యూఎస్ కోటాలో అవకాశాలు దక్కుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముందుగా బీసీల హక్కులు, ప్రయోజనాలను పరిరక్షించిన తర్వాతే ఇతర రిజర్వేషన్ల అంశాలను పరిశీలించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బీసీ కులాల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేశారు. ముదిరాజ్‌లను బీసీ–ఏలో చేర్చే ప్రయత్నాలను విరమించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. బీసీలకు అన్యాయం జరిగితే తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పోరాటం సాగిస్తామని పేర్కొన్నారు.ఈ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు గోపి రజక, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ విజయ్ గణేష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిపాక లక్ష్మణ్, ఉపాధ్యక్షుడు సాంబరాజు కుమార్, రాష్ట్ర కన్వీనర్ షాగంటి వెంకటేష్, జిల్లా అధ్యక్షుడు జంగపల్లి ఐలయ్య, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దిటి రాజు, మాజీ ఎంపీపీ దుర్గయ్య, మాజీ కౌన్సిలర్ శివగారి అంజయ్య, సర్పంచులు నేరెళ్ల రాజయ్య, కరుణాకర్, జిల్లా గౌరవ అధ్యక్షులు, మండల నాయకులు పాల్గొన్నారు.