BREAKING
అంగవైకల్యాన్ని అధిగమించి జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికైన సాయినాథ్ రెడ్డికి ఘన సన్మానం.. రూ.50 వేల నగదు ప్రోత్సాహకం ఓటీటీలో భయపెడుతున్న కొత్త హారర్ వెబ్ సిరీస్.. ఫ్రీగా వీక్షించండి! రోగులకు పండ్లు బ్రెడ్ పంపిణీ చేసిన సర్పంచ్ శాంతి కిషన్ నాయక్ కరువు నివారణ చర్యలపై అధికారుల దృష్టి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు స్పోర్ట్స్‌ దుస్తుల పంపిణీ అభినందనీయం: పీఏసీఎస్‌ చైర్మన్‌ మన్నె శంకర్‌ యాదవ్‌ సంచలన దర్శకుడు శ్రీకాంత్ ఓడెల కొత్త సినిమా.. ఆసక్తికరమైన బ్యాక్‌డ్రాప్‌లో లవ్ స్టోరీ! ఈనెల 30 నుంచి పుష్కర బ్రహ్మోత్సవాలు నేటి నుంచి వాడపల్లి వెంకన్న బ్రహ్మోత్సవాలు పోలీసు అమరవీరుల త్యాగం చిరస్మరణీయం-సీఐ పవన్ కుమార్ డబ్ల్యూపీఎల్ 2027 వేలం.. ఆస్ట్రేలియా ప్లేయర్‌కు భారీ ధర, ఎవరెవరు ఏ జట్టుకంటే? పసునూరి నాగేశ్వర్ మృతి ఈరవెన్ను గ్రామానికి తీరని లోటు అలియాబాద్‌ 18, 19వ వార్డుల్లో లో వోల్టేజ్‌ సమస్యకు చెక్‌.. 100 కేవీ ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటుకు భూమిపూజ హాలీవుడ్ సంచలనం.. మళ్లీ క్యాట్నిస్‌గా జెన్నిఫర్ లారెన్స్ రీఎంట్రీ నల్లబెల్లి ని కరువు మండలం గా ప్రకటించాలి షఫాలీ వర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీ.. జింబాబ్వేపై భారత్ క్లీన్ స్వీప్

బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొగిలి శ్రీనివాస్

Select Suryaa Now
బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శిగా మొగిలి శ్రీనివాస్

సూర్య - మానకొండూర్ : మానకొండూర్ మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన మొగిలి శ్రీనివాస్ బీజేపీ ఎస్టీ మోర్చా కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్ నియామక ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్భంగా మొగిలి శ్రీనివాస్ మాట్లాడుతూ... తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించినందుకు పార్టీ అధిష్టానానికి, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. తన నియామకానికి సహకరించిన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రమావత్ శ్రీనివాస్ నాయక్, జిల్లా ఉపాధ్యక్షుడు గుర్రాల వెంకటరెడ్డి, సీనియర్ నాయకులు రంగు భాస్కరాచారి, రాపాక ప్రవీణ్, మానకొండూర్ మండల అధ్యక్షుడు కంది రాజీరెడ్డిలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను గిరిజన ప్రాంతాల్లోని ప్రతి ఇంటికీ చేరువ చేసేలా పనిచేస్తానని శ్రీనివాస్ తెలిపారు..