అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు:సర్పంచ్ రవీందర్ నాయక్
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడం జరుగుతుందని సర్పంచ్ రవీందర్ నాయక్ అన్నారు. గురువారం మండల పరిధిలోని చెరువు ముందలి తండాలో (ఏ) సర్పంచ్ రవీందర్ నాయక్ అధ్యక్షతన లబ్ధిదారులకు చేయూత పింఛన్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ రవీందర్ నాయక్ మాట్లాడుతూ.. ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందిస్తూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఇతర అర్హులైన లబ్ధిదారులకు ఆర్థిక భరోసా కల్పిస్తోందని అన్నారు. పింఛన్ల ద్వారా లబ్ధిదారులకు కొంత ఆర్థిక చేయూత లభిస్తుందని, ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి లలిత, నాయకులు లోక్య నాయక్, గోపియా నాయక్, రమేష్, లబ్ధిదారులు పాల్గొన్నారు.