BREAKING
క్రషర్ మిషన్ల దుమ్ముతో పంటలకు నష్టం బ్యారెల్‌కు $86కి దిగొచ్చిన బ్రెంట్ క్రూడ్: భారత్‌కు ఊరట ఆసియా మార్కెట్ల దూకుడు: నిక్కీ, కోస్పి భారీ ర్యాలీ కళ్యాణదుర్గం లో 24 వ వార్డు లో మౌలిక వసతులు పరిశీలన. అమెరికా మార్కెట్లలో ర్యాలీ: నాస్‌డాక్, ఎస్ అండ్ పీ 500 రికార్డు లాభాలు టెక్ ఆదాయాల జోరు: అంతర్జాతీయ మార్కెట్లలో సానుకూల పవనాలు మృతుడి కుటుంబానికి బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సుందరి అనిల్ రూ.11 వేల ఆర్థిక సాయం రూపాయి మారకం విలువ స్థిరత్వం: డాలర్‌తో పోలిస్తే 93.65 - 93.74 వద్ద ట్రేడింగ్ బ్యాంకింగ్ & రంగాల జోరు: 1.7% పెరిగిన నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ 210.40 పాయింట్ల లాభం: 25,255 ఎగువన సరికొత్త ముగింపు సెన్సెక్స్ 772.75 పాయింట్ల లాభం: 81,879 వద్ద ముగింపు ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత నోటిఫికేషన్ మార్కెట్లకు భారీ ఊపు: ఎఫ్‌పీఐల కొనుగోళ్లు, చమురు ధరల తగ్గింపు దేశీయ మార్కెట్లలో బుల్స్ హవా: సెన్సెక్స్, నిఫ్టీ భారీ లాభాలు స్టాక్ మార్కెట్ & అంతర్జాతీయ ఆర్థిక రంగం: తాజా విశ్లేషణ

అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా!

Select Suryaa Now
అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా!

 

ఉన్నతాధికారుల ఆదేశాలు భేఖాతర్.      
                     .                   తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు.

* ఫిర్యాదులు అందినా పట్టించుకోని టౌన్ ప్లానింగ్ అధికారులు..

* జిహెచ్ఎంసి ఆదాయానికి భారీగా గండి!

తుర్క యంజాల్, మేజర్ న్యూస్ :ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని తుర్కయంజాల్, తొర్రూర్ డివిజన్‌లో అక్రమ నిర్మాణాలు యథేచ్ఛగా సాగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.ఆదిభట్ల సర్కిల్ పరిధిలోని రాగన్నగూడ డెక్కన్ బావర్చి హోటల్ ఎదురుగా అభ్యుదయ కాలనీలోనే కాకుండా కమ్మగూడ ఏపీఏటీ కాలనీలో అనుమతులకు విరుద్ధంగా నిర్మాణాలు జరుగుతున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.ఈ అక్రమ నిర్మాణాలపై అధికారులకు ఫిర్యాదులు అందినప్పటికీ క్షేత్రస్థాయిలో తగిన చర్యలు తీసుకోవడం లేదని, టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.భవన నిర్మాణాలకు ఒకరకమైన అనుమతులు తీసుకుంటూ, క్షేత్రస్థాయిలో మాత్రం నిబంధనలకు విరుద్ధంగా అదనపు అంతస్తులు, భారీ కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అనుమతుల పరిశీలన, నిర్మాణాల పర్యవేక్షణ చేయాల్సిన టౌన్ ప్లానింగ్ సిబ్బంది చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఫిర్యాదులు అందిన తర్వాత కూడా నిర్మాణ పనులు కొనసాగుతుండటంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

 

 

 

స్థానికుల ఆవేదన: 
అక్రమ నిర్మాణాల వల్ల భవిష్యత్తులో రోడ్లపై ట్రాఫిక్ సమస్యలు, పార్కింగ్ ఇబ్బందులు, డ్రైనేజీ సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా స్పందన కనిపించడం లేదని, నిబంధనలు ఉల్లంఘించే నిర్మాణదారులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. సామాన్యులు చిన్న నిర్మాణం చేపడితే అనుమతుల పేరుతో ఇబ్బందులు పెట్టే అధికారులు, భారీ నిర్మాణాల విషయంలో ఎందుకు మౌనం వహిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. రాగన్నగూడ సాగర్ హైవే, ఏపీఏటీ కాలనీలోని ఆరోపణలు ఎదుర్కొంటున్న నిర్మాణాలపై సమగ్ర విచారణ చేపట్టి, అనుమతులు, వాస్తవ నిర్మాణాలను పరిశీలించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.అక్రమ నిర్మాణాలను అడ్డుకోవడంతో పాటు బాధ్యులైన అధికారుల నిర్లక్ష్యంపైనా విచారణ జరిపి ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఆదిభట్ల డిప్యూటీ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి :

డివిజన్ పరిధిలో అనుమతులకు విరుద్ధంగా చేపట్టే నిర్మాణాలను ఉపేక్షించేది లేదు. అక్రమ నిర్మాణాలపై అందిన ఫిర్యాదులను పరిశీలించి, క్షేత్రస్థాయిలో విచారణ చేపడతాం. నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే నోటీసులు జారీ చేసి, చట్టప్రకారం కూల్చివేతతో సహా తగిన చర్యలు తీసుకుంటాం. టౌన్ ప్లానింగ్ అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని ఆదేశిస్తాం.

ఎడ్ల వెంకటేష్ గౌడ్,మేజర్ న్యూస్ తుర్కయంజాల్.