ఏపీలో పంచాయతీ ఎన్నికలకు రేపు తొలి విడత నోటిఫికేషన్
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. రాష్ట్రంలో మూడు దశల్లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్ఈసీ) సిద్ధమైంది. ఇందులో భాగంగా తొలి విడత పంచాయతీ ఎన్నికలకు రేపు (శుక్రవారం) నోటిఫికేషన్ విడుదల కానుంది. షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న తొలి విడత, 29న రెండో విడత, డిసెంబర్ 2న మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. కాగా, డిసెంబర్ 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.