తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ
తిరుమల: కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరస్వామి వారి దర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని 31 కంపార్ట్‌మెంట్లు భక్తులతో నిండిపోవడంతో, క్యూ లైన్ వెలుపల శిలా తోరణం వరకు విస్తరించింది. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనం లభించేందుకు సుమారు 18 గంటల సమయం పడుతోంది. కాగా, నిన్న ఒక్కరోజే 73,392 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వీరిలో 33,288 మంది భక్తులు తలనీలాలు సమర్పించగా, శ్రీవారి హుండీ ద్వారా రూ. 3.9 కోట్ల ఆదాయం సమకూరినట్లు తితిదే అధికారులు వెల్లడించారు.