BREAKING
క్వాల్‌కామ్‌లో ఉద్యోగాల కోత: భారత్‌లో 1,000 పోస్టులపై ప్రభావం బజాజ్ ఫైనాన్స్ రూ. 11,700 కోట్ల క్యూఐపీ: మార్కెట్ ధరపై 5% డిస్కౌంట్ నేటి పంచాంగం 12 నవంబర్, 2026 నేటి రాశి ఫలాలు (12-11-2026): 12 రాశుల ఫలితాలు అయ్యప్ప స్వామి దేవస్థానానికి రామిడి కళ్యాణి వినయ్ రెడ్డి దంపతుల విరాళం టాటా ఇన్వెస్ట్‌మెంట్ కొత్త ఛైర్మన్‌గా బహ్రామ్ వకీల్: నోయెల్ టాటా రిటైర్మెంట్ భారత కార్పొరేట్ల క్యూ2 ఫలితాలు: భారీగా పెరిగిన లాభాలు కుక్కల దాడిలో పసిపాప మృతి.. దిందా గ్రామంలో విషాదం! అనుమతులు ఒక్కలా.. నిర్మాణాలు మరోలా! హీరోగా నిలదొక్కుకోవడం ఆషామాషీ కాదు.. సుధీర్ కష్టం చాలా గొప్పది: మంచు మనోజ్ ప్రపంచ షూటింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు రెండు కాంస్య పతకాలు.. సత్తా చాటిన షూటర్లు! జపాన్‌ మాస్టర్స్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీ: రెండో రౌండ్‌లోకి దూసుకెళ్లిన లక్ష్యసేన్, కిదాంబి శ్రీకాంత్ సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2' ఓటీటీ స్ట్రీమింగ్ షురూ.. ఎందులో చూడొచ్చంటే? బంగారం, వెండి కొనుగోలుదారులకు గుడ్ న్యూస్.. స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు! తులం ఎంతంటే? నేడు, రేపు విశాఖలో 31వ సీఐఐ పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్

నేడు షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీ

Select Suryaa Now
నేడు షెడ్యూల్ విడుదల చేయనున్న ఎస్ఈసీ

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) రంగం సిద్ధం చేసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్‌ను నేడు మధ్యాహ్నం 12:30 గంటలకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా అధికారికంగా విడుదల చేయనున్నారు.

న్యాయపరమైన చిక్కులు, వివాదాలు తొలగిపోవడంతో పాటు వార్డుల పునర్విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ఈ ఎన్నికలను నిర్వహిస్తున్నారు. వీటిలో శ్రీకాకుళం, కాకినాడ, రాజమహేంద్రవరం, మంగళగిరి-తాడేపల్లి నగర పాలక సంస్థలతో పాటు మరో 19 పురపాలక సంఘాలు (మున్సిపాలిటీలు) ఉన్నాయి. వీటిలో ఆమదాలవలస, రాజాం, భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, చింతలపూడి, గుడివాడ, తాడిగడప, పొన్నూరు, బాపట్ల, నరసరావుపేట, పొదిలి, కందుకూరు, కావలి, అల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, బి. కొత్తకోట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ నెల 26వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.