ఎమ్మిగనూరులో టీడీపీ x జనసేన
ఎమ్మిగనూరు, సూర్య ప్రతినిధి
స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల ముగిశాయి.. ఇక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన చేతిలో ఉన్న గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి స్థాయిలో పంచాయతీ ఎన్నికలు మన ముందున్నాయి. ఈ సమయంలో చేనేతపురం ఎమ్మిగనూరులో తెలుగుదేశం జనసేన నాయకులు మధ్య స్థానిక రగడ చోటుచేసుకుంది.. జనసేన పార్టీ కర్నూలు జిల్లా కో కన్వీనర్ చల్లా వరుణ్ ఇక్కడ ఎమ్మెల్యే బి.వి జయ నాగేశ్వర్రెడ్డి జనసేన ను బిజెపిని పొత్తుధర్మం పాటించకుండా నిలువునా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముంచి వేశారని రెండు రోజుల క్రితం తీవ్ర స్థాయిలో ధ్వజం ఎత్తారు. దీంతో బివి అనుచరులు ఒక్కొక్కరు చల్లాపై మాటల యుద్ధానికి దిగారు.. టిడిపి పట్టణ ప్రధాన కార్యదర్శి దామా నర్సింహులు చేసిన వ్యాఖ్యలకు జనసేన కర్నూల్ పార్లమెంట్ వీర మహిళ అనిత తో పాటు చల్లా కూడా సామాజిక మాధ్యమాల్లో విరుచుకుపడ్డారు. జనసేనకు 30% సీట్లు కేటాయించాల్సిన టిడిపి ఎమ్మెల్యే పొత్తు ధర్మానికి పోట్లు ఎందుకు పొడిచారని ప్రశ్నిస్తే దానికి అనుచరులతో కౌంటర్లు ఇప్పించడం తగదని హితవు పలికారు. రాష్ట్రంలో జనసేన ని పవన్ కళ్యాణ్ టిడిపి నాయకులు చంద్రబాబు నాయుడు లోకేష్ లు కలిసి సంక్షేమ అభివృద్ధి పయనిస్తుంటే స్థానిక ఎమ్మెల్యే మాత్రం అందుకు విరుద్ధంగా జనసేనను బిజెపిని ఎదగనీకుండా తొక్కేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ బీవీ చేసిన తప్పిదాలన్నింటినీ జనసేన అధిపతి పవన్ కళ్యాణ్ దృష్టికి అలాగే నారా లోకేష్ చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరుగుతుందని వారు హెచ్చరించారు. చేనేతపురం ఎమ్మిగనూరు కూటమి లో జరుగుతున్న స్థానిక సంస్థల ఎన్నికల రగడ ఎక్కడిదాకా దారులు తీస్తుందో వేచి చూడాలి. మరో ఐదు రోజుల్లో గ్రామపంచాయతీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కూటమి పొత్తు ఎమ్మిగనూరు లో కలిసి పనిచేస్తుందా.. లేక మున్సిపల్, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల మాదిరి గానే పొట్టి ధర్మానికి పోర్టు పొడుసుకుంటారా అన్నది ఆసక్తికరం రేపుతుంది.