BREAKING
సీపీఐ(ఎం) పాదయాత్రకు ప్రజాదరణ త్వరలో పెళ్లిపీటలెక్కనున్న మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్: సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతున్న వార్తలు! తెల్లాపూర్‌లో అక్రమ బోర్‌వెల్ కేంద్రాలపై అధికారుల దాడులు జాతీయ మహాసభలను జయప్రదం చేయాలి యుఏఈలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రి పర్యటన హరిత భారత్ నిర్మాణంలో ప్రధాని మోదీ విజన్ రావులపాలెం మండలంలో చిర్ల జగ్గిరెడ్డి విస్తృత పర్యటన ప్రజాస్వామ్యానికి విభేదాలే నిజమైన బలం..లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా -కర్దనూరు శిశు విహార్ హైస్కూల్‌లో విద్యార్థినులకు అవగాహన సదస్సు సకల ఆత్మల పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించిన చిన్నపురి గ్రామస్తులు కూటమి ఐక్యతను దెబ్బతీసేందుకు వైసీపీ కుట్రలు.. అప్రమత్తంగా ఉండాలి ఓట్ల లెక్కింపులో సంయమనం పాటించాలి – ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు సాగు భూమి సంరక్షణ కార్యక్రమం అవగాహన కళాశాలల సమీపంలో మద్యం విక్రయాలు! జిల్లాల్లోనే 90 శాతం వైద్య సేవలు అందించాలి! మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశాలు మల్లేశ్వర స్వామి సాక్షిగా హామీ ఇస్తున్నా ..

-అన్ని మండలాల్లో కరువు ఉన్న రేగోడు మండలానికి లేదా.. సర్పంచ్ అమరసింహారెడ్డి

Select Suryaa Now
-అన్ని మండలాల్లో కరువు ఉన్న రేగోడు మండలానికి లేదా.. సర్పంచ్ అమరసింహారెడ్డి

రేగోడు మేజర్ న్యూస్: ప్రతి 45 రోజులకు అధికారులు సర్పంచుల తో నిర్వహించే ప్రత్యేక మండల స్థాయి సమీక్ష సమావేశానికి చాలా శాఖల అధికారులు రాకపోగా వచ్చినా అధికారులు సభకు గౌరవం ఇవ్వకుండా మొక్కుబడిగా వచ్చి లోనికి బయటకు తిరగడం వెళ్ళిపోవడం జరిగింది. సోమవారం రేగోడు మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక మండల స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. మండలంలో 18 మంది సర్పంచులు ఉండగా 8 మంది మాత్రమే హాజరయ్యారు మిగతా పదిమంది సర్పంచులు సమావేశానికి రాలేదు. రేగోడు మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని, వేరే మండలాల్లో ఉన్న కరువు రేగోడు మండలంలో లేదా, అధికారులు రేన్ ఫాల్ ఎలా తీసి పై అధికారులకు ఇవ్వడం జరిగిందని దోసపల్లి సర్పంచ్ అమరసింహారెడ్డి సభ దృష్టికి తెచ్చారు. ఇందిరమ్మ ఇళ్ళను అర్హులను గుర్తించి ఇవ్వాలని దోసపల్లి సర్పంచ్ అమరసింహారెడ్డి తో పాటు పెద్ద తాండ సర్పంచ్ సంగ్యా నాయక్ హౌసింగ్ ఏఈ ని ప్రశ్నించారు. హౌసింగ్ ఏఈ మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి అర్హులకు ఇచ్చే విధంగా చూస్తామని హామీ ఇచ్చారు. మిషన్ భగీరథ డిఈ నరేష్, గ్రిడ్ డిఈ బాలకృష్ణ లో మాట్లాడుతూ సర్పంచులు గ్రామసభల్లో మరియు దండోరా వేయించి నీళ్లను పొదుపుగా వాడుకోవాలని అవగాహన కల్పించాలని, లేనివో ప్రభావం వల్ల వర్షాలు లేక నీటి కొరత ఏర్పడిందని,డిసెంబర్ వరకు కొన్ని నీళ్లు సద్దుబాటు అయ్యే అవకాశం ఉందని, పంచాయతీ పరిధిలో ఉన్న బోరు బావుల నుండి ప్రత్యేక పైప్ లైన్ ద్వారా ట్యాంకులను నింపి సర్పంచులు నీళ్లు సద్దుబాటు అయ్యేవిధంగా చూడాలని, వ్యవసాయ బోర్ బావుల నుండి కూడా నీటిని తీసుకొని సర్దుబాటు అయ్యేవిధంగా చూడాలని డీఈలు సూచించారు. కొండాపురం సర్పంచ్ పండరి మాట్లాడుతూ గతంలో ప్రజావాణిలో ఇచ్చిన దరఖాస్తులకు ఎలాంటి స్పందన లేదని అదేవిధంగా కొండపురంలో సెల్ఫోన్ సిగ్నల్స్ సమస్య ఉందని సమస్యలను పరిష్కరించాలని సభా దృష్టికి తీసుకువచ్చారు.గతంలో నిర్వహించిన ప్రత్యేక మండల పరిషత్ ప్రత్యేక స్థాయి సమావేశంలో చర్చించి తీర్మానించిన పనులు ఎంతవరకు వచ్చాయి, ఎన్ని పెండింగ్లో ఉన్నాయి అనేది అధికారులు ప్రజాప్రతినిధులకు ఇవ్వాల్సిన ఎజెండా కాఫీ మినిట్స్ ఇవ్వడంలో మండల పరిషత్ అధికారులు విఫలమయ్యారు.ఈ కార్యక్రమంలో సర్పంచ్ లు సరోజన, నిర్మల, నర్సమ్మ, సక్కుబాయి,సంగమేశ్వర్,హసిల్దార్ దత్తారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాస్, ఎంఈఓ గురునాథ్, డాక్టర్ శ్వేత,ఏవో శ్రీదేవి ఏపీఓ జగన్మోహన్ రెడ్డి. ఆర్ఐ శరణప్ప తదితరులు పాల్గొన్నారు