BREAKING
గ్లోబల్ మార్కెట్లలో భద్రమైన పెట్టుబడుల జోరు విధి నిర్వహణలో అస్వస్థతకు గురైన విద్యుత్ ఉద్యోగి ఫిసర్‌వ్‌లో కొత్త సీఈవో నిర్ణయంతో 3,000 మంది ఉద్యోగాలు తొలగింపు అమలాపురం కూటమి కైవసం.. చైర్ పర్సన్ గా నల్లా శ్రీధర్.. ఇటలీ బ్యాంకింగ్ రంగంలో మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్‌కు ఇంటెసా సన్నాహాలు చిత్తూరులో టీడీపీ జయభేరి: 35,050 ఓట్ల భారీ మెజార్టీతో మేయర్ పీఠం కైవసం పరిశ్రమలలో భద్రతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలి జిన్నారం సీఐ నాగార్జున గౌడ్ 35వ వార్డులో ఉత్కంఠకు తెర.. రీ కౌంటింగ్‌లో జనసేన అభ్యర్థి విజయం.!.. రైతులకు మద్దతు ధర అందేలా ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి : కలెక్టర్ 30 ట్రిలియన్ యూరోల నిధుల కొరత ఏర్పడుతుందని హెచ్చరించిన నివేదిక ఇంటెసా సానిపాల్డో ప్రకటన.. మోంటె డి పాశ్చి ఒప్పందం కొలిక్కి వచ్చాక మెడియోబంకాపై బైఅవుట్ ఆఫర్ ఫేక్ జాబ్ ఇంటర్వ్యూల ద్వారా బైనాన్స్ హ్యాకింగ్..డిజిటల్ వాలెట్లపై సైబర్ నేరగాళ్ల పంజా అమెరికా ఎన్నికల కేసుల్లో ట్రంప్ యంత్రాంగానికి ఎదురుదెబ్బ కమ్యూనిస్ట్ పాలనలో సీక్రెట్ పోలీసుల ఒత్తిడి..రిక్రూట్‌మెంట్‌ను తిరస్కరించిన హంగేరి మాజీ ప్రధాని ఓర్బన్ కేసీఆర్ ను కలిసిన బీఆర్ఎస్ నేతలు

అక్రమ బోరు తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చర్యలు

Select Suryaa Now
అక్రమ బోరు తవ్వకాలపై రెవెన్యూ అధికారులు చర్యలు

 

జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలోని బీరప్ప బస్తి సమీపంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేస్తున్న బోరు ని రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకున్నారు. ప్రభుత్వ నిబంధనలను పట్టించుకోకుండా, సంబంధిత శాఖల నుంచి ఎలాంటి ముందస్తు అనుమతులు పొందకుండానే బోర్ వేస్తున్న ఘటనను స్థానికుల ఫిర్యాదు మేరకు అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో మంగళవారం స్థానికుల ఫిర్యాదు మేరకు జిన్నారం తాసిల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ ఇన్స్పెక్టర్లు శ్రీనివాస్ ,యాదయ్యలు రంగంలోకి దిగి స్థానిక చర్చి బస్తీ సమీపంలో బోర్‌వెల్ తవ్వకాలకు ఉపయోగిస్తున్న వాహనాన్ని సీజ్ చేశారు. అనంతరం స్వాధీనం చేసుకున్న వాహనాన్ని తదుపరి చర్యల నిమిత్తం ఐడీఏ బొల్లారం పోలీసులకు అప్పగించారు. పట్టణ ప్రాంతాల్లో అనుమతులు లేకుండా బోర్లు వేయడం వల్ల భూగర్భ జలాల వినియోగం, తవ్వకాల నియంత్రణకు సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. బోర్‌వెల్ తవ్వకాలు చేపట్టే ముందు తప్పనిసరిగా సంబంధిత శాఖల నుంచి అనుమతులు పొందాలని సూచించారు. నిబంధనలను అతిక్రమించి అనధికారికంగా బోర్లు వేస్తే వాహనాలను సీజ్ చేయడంతో పాటు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో సిబ్బంది మౌలానా ,  పోలీసులు, స్థానికులు పాల్గొన్నారు.

  జిన్నారం రిపోర్టర్ యు .చంద్రశేఖర్