*అధికారులు లేక వెలబోతున్న ప్రజావాణి*
అల్లాదుర్గం;అల్లాదుర్గం మండలం లోని ప్రజా సమస్యల తక్షణ పరిష్కారం కొరకు ప్రభుత్వం ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది.ఈ ప్రజావాణికి ప్రతి శాఖ అధికారులు హాజరుకావాలని సూచించింది.కానీ అల్లాదుర్గం ప్రజావాణికి అధికారుల కరువు ఏర్పడింది. సోమవారం జరిగిన ప్రజావాణికి తహశీల్దార్ మల్లయ్య, ఎంపీడీఓ వేద ప్రకాష్ రెడ్డి, ఎంపీఓ సుధాకర్, ఏఓ నెలవంక, ఏపీఎం రుక్మిణి, ఐసీడీఎస్ సూపర్వైజర్ తేజస్విని, ఇరిగేషన్ ఏఈ వైష్ణవి, పీహెచ్సీ సీహెచ్ఓ సుదర్శన్ మాత్రమే హాజరయ్యారు. మిగతా శాఖల అధికారులు డుమ్మా కొట్టారు.అధికారులు లేకపోవడంతో ప్రజావాణిలో కేవలం 7 ఫిర్యాదులే వచ్చాయి. అల్లాదుర్గం ను కరువు మండలంగా ప్రకటించాలని 1, బోర్ పర్మిషన్ 1, ఇందిరమ్మ ఇండ్లు 1, ఎమ్మార్వో ఆఫీస్ కు సంబంధించి 2, విద్యుత్ సమస్య 1,గడి పెద్దాపూర్ మేజర్ గ్రామ పంచాయతీకి రెగ్యులర్ పంచాయతీ కార్యదర్శిని నియమించాలని 1,శ్మశాన వాటికకు సంబంధించిన భూమి మొత్తం అన్యాక్రాంతం కు గురైందని,అన్యాక్రాంతమైన భూమిని తిరిగి స్వాధీనం చేసుకొని గ్రామ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని బిఆర్ఎస్ నాయకులు ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు.అధికారులు ఉంటేనే ప్రజలు వస్తారని, గైర్హాజరైన అధికారులపై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.