ఆకట్టుకున్న నాట్యభారతి కూచిపూడి నృత్య ప్రదర్శనలు
రవీంద్ర భారతి, మేజర్ న్యూస్ : దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా శ్రీ నరసింహ కూచిపూడి నాట్య భారతి ఆధ్వర్యంలో సాంప్రదాయ నృత్య ప్రదర్శనలు ప్రదర్శించారు. కార్యక్రమంలో కళాకారులు 'శ్రీనృసింహ' కూచిపూడి రూపకంతో పాటు శ్లోకాలు, నాట్య అంశాలను ప్రదర్శించి వీక్షకులను ఆకట్టుకున్నారు. ఈ వేడుకలో భాగంగా వాణిలక్ష్మి గణపతి, మహాగణపతిం, నటేశ కౌత్యం, జయము జయము, ఎంత మాత్రమున, జయ జనార్ధన, గజనాయకాయ (బ్రహ్మాంజలి), నృత్యతి, 'ప్రహ్లాద పట్టాభిషేకం' (కొలువైతివరంగసాయి), తిల్లాన అంశాలతో పాటు 'మహిషాసుర మర్ధిని' నృత్య నాటికను ప్రదర్శించారు. కార్యక్రమానికి జోన్నాడ, సిద్ధప్ప, బాబులాల్, లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను అభినందించి కళాకారులకు సర్టిఫికెట్లు, మెమొంటోలను అందజేశారు