ఆడబిడ్డలకు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే గాంధీ
శేరిలింగంపల్లి,మేజర్ న్యూస్ : తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా శేరిలింగంపల్లి ఆడబిడ్డలకు ఎమ్మెల్యే గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఆటపాటల సాంస్కృతిక వైభవమే బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు.
పువ్వులనే దేవతగా కొలుస్తూ, ప్రకృతిని ఆరాధించే తెలంగాణ ఆడబిడ్డల బతుకమ్మ పండుగ దేశంలోని సంప్రదాయ పండుగలన్నింటిలో ప్రత్యేకమైనదని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. తెలంగాణ జీవన విధానానికి, ఆడబిడ్డల ఆత్మగౌరవానికి, సామాజిక సంస్కృతికి అద్దం పడుతూ ఈ పండుగ తెలంగాణ ప్రజల జీవితాల్లో అంతర్భాగంగా నిలిచిందని చెప్పుకొచ్చారు
.తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగ సందర్భంగా ప్రజలకు ఎమ్మెల్యే గాంధీ శుభాకాంక్షలు తెలిపారు. ఆడబిడ్డల ఆత్మగౌరవాన్ని చాటిచెప్పే ఆటపాటల సాంస్కృతిక వైభవమే బతుకమ్మ పండుగ అని ఆయన పేర్కొన్నారు.