BREAKING
25వ డివిజన్‌లో ఘనంగా సురేష్ జన్మదిన వేడుకలు నేటి పంచాంగం 23అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –23 అక్టోబర్ 2026 అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో ఉండేలా చర్యలు టీ.జీ.పి.ఎస్.సీ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి ఆధిపత్యాన్ని ఎదుర్కోవాలంటే బహుజనులకు విద్యే ఆయుధం నరసాపురం మండలంలో రెండవ రోజు 36 నామినేషన్ లు భూ భారతి దరఖాస్తులను గడువులోగా పరిష్కరించాలి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన కూటమి ప్రభుత్వం -- వైసీపీ జిల్లా అధ్యక్షులు ముదునూరి నవంబర్ 1, డిసెంబర్ 5,6 తేదీలలో బాలోత్సవం వేడుకలు ఓటీటీలోకి కీర్తి సురేశ్ తాజా సినిమా.. డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ డప్పు కళాకారుల, చర్మకారుల కుటుంబాలు కూటమికి ఓట్లు వేసి అభ్యర్థులను గెలిపించాలి రావులపాలెం మండలంలో రెండో రోజు భారీగా నామినేషన్లు ఒక్కరోజే 67 నామినేషన్ల దాఖలు.. టీడీపీ నుంచి 30, వైసీపీ నుంచి 25 ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైన తెలుగు మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్.. త్వరలోనే స్ట్రీమింగ్ అనపర్తి జడ్పీటీసీ పోరులో ఇద్దరు ఈశ్వరులు.. టీడీపీ నుంచి వాసంశెట్టి నాగేశ్వరరావు, వైసీపీ నుంచి కొండేటి భీమేశ్వరరావు నామినేషన్లు

24న హైదరాబాద్లో స్వర్ణకారుల శంకారావం భారీ బహిరంగ సభ.

Select Suryaa Now
24న హైదరాబాద్లో స్వర్ణకారుల శంకారావం భారీ బహిరంగ సభ.

సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్వర్ణకారుల సమస్యల పరిష్కారం, వృత్తి పరిరక్షణ, వారి సంక్షేమమే ధ్యేయంగా ఈ నెల 24న హైదరాబాద్లో స్వర్ణకార శంకారాం పేరిట భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్ర స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సభకు సంబంధించిన ప్రచార వాల్ పోస్టర్ను సికింద్రాబాద్ సోమసుందరం స్ట్రీట్లోని విశ్వకర్మ సంఘ భవనంలో సంఘ అధ్యక్షుడు గోపాలపురం ప్రకాష్, ప్రధాన కార్యదర్శి గిర్మాపురం భాస్కరాచారి తదితర కార్యవర్గ సభ్యులు ఆవిష్కరించారు.

 ఈ సందర్బంగా సంఘ అధ్యక్షుడు గో పాలపురం ప్రకాష్ మాట్లాడుతూ... ముందుగా అందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. శనివారం సరూర్ నగర్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న ఈ భారీ బహిరంగకు న్యాయమైన డిమాండ్ల సాధనే ధ్యేయంగా ప్రత్యేక కార్పొరేషన్, 50 సంవత్సరాలు నిండిన ప్రతి స్వర్ణకారునికి రూ5వేల పెన్షన్. జీఓ 272 సవరణకు డిమాండ్ చేస్తూ ప్రభుత్వానికి కనువిప్పు కలిగేలా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రధాన కార్యదర్శి గిర్మపురం భాస్కరాచారి మాట్లాడుతూ... రాష్ట్ర స్వర్ణకార సంఘం ముఖ్య నేతలైన ఈ సభ ద్వారా స్వర్ణకారుల ఐఖ్యతను ప్రభుత్వానికి చూపాలని పిలుపునిచ్చారు. 

జనరల్ బజార్లోని స్వర్ణకారులు తమ తమ దుకాణాలను మూసివేసి శనివారం 2గంటలకు సంఘ భవనానికి వస్తే ఇక్కడి నుండి బైక్ ర్యాలీగా సరూర్ నగరకు వెళ్లనున్నట్లు విలుపునిచ్చారు. ఈ భారీ బహిరంగ సభకు సికింద్రాబాద్. హైదరాబాద్ లలో ఉన్న చార్కమాన్. సికింద్రాబాద్, పాట్ మార్కెట్, సిద్ధిఅంబర్ బజార్, గాలిగూడ తదితర సంఘాలు తమ పూర్తి మద్దతునిస్తున్నట్లు వెల్లడించారు.