BREAKING
భక్తి పారవశ్యంలో దుర్గామాత నిమజ్జన శోభాయాత్ర -- సంప్రదాయ దుస్తుల్లో మహిళల సందడి.. -- భక్తి పాటలకు యువత నృత్యాలు.. -- బతుకమ్మలతో పండుగ శోభ అమ్మవారి ముక్కుపుడక రూ. 4 లక్షల 11 వేలు.. భక్తిశ్రద్ధలతో వాసవి అమ్మవారి శోభాయాత్ర సంగెం గ్రామంలో ఘనంగా అమ్మవారి నిమజ్జన వేడుకలు పోలీస్ అమరవీరుల త్యాగాలు మరువలేనివి పోలీస్ అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం-వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత దేవరుప్పుల పోలీస్ స్టేషన్ లో ఆయుధపూజ సుప్రీంకోర్టు ఆదేశాలతో మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ తాత్కాలిక నిలిపివేత నేటి నుంచి రైతుల కోసం ప్రత్యేక అవగాహన సదస్సులు ఆర్థిక సహాయం అందజేత కొల్లూరి లక్ష్మమ్మ మృతి పట్ల మాజీ మంత్రి ఎర్రబెల్లి సంతాపం మానకొండూరులో ఘనంగా యూత్ కాంగ్రెస్ నాయకుడు తాళ్లపెళ్లి శ్రీకాంత్ జన్మదిన వేడుకలు పాత డ్రైనేజీలకు కొత్త రూపు- ప్రజా సమస్యల పరిష్కారంలో సర్పంచ్ చొరవ రణబాలి బాక్సాఫీస్ కలెక్షన్ల జోరు: ఆరవ రోజు స్వల్ప తగ్గుదల, రూ.41 కోట్లు దాటిన వసూళ్లు! యానిమేషన్ సినిమాలు కేవలం పిల్లల కోసమేనా: పెద్దలను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న అద్భుత ప్రపంచం!

12వ వార్డులో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు* *వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్ పులిమామిడి మమత రాజు మరియు వార్డు మహిళలు

Select Suryaa Now
12వ వార్డులో అంగరంగ వైభవంగా సద్దుల బతుకమ్మ వేడుకలు*    *వేడుకల్లో పాల్గొన్న కౌన్సిలర్   పులిమామిడి మమత రాజు మరియు వార్డు మహిళలు

సదాశివపేట;సదాశివపేట పట్టణంలోని పాతకేరి 12వ వార్డులో కౌన్సిలర్ పులిమామిడి మమత ఆధ్వర్యంలో సద్దుల బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని వార్డు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని వేడుకలను ఉత్సాహంగా జరుపుకున్నారు.ఈ సందర్భంగా వార్డు మహిళలు ఉదయం నుంచే రంగురంగుల తంగేడు, గునుగు తదితర పూలను సేకరించి, వాటితో అందమైన బతుకమ్మలను పేర్చారు. అనంతరం సాయంత్రం వార్డులోని ప్రధాన కూడలిలో బతుకమ్మలను ఒకచోట చేర్చి, సంప్రదాయబద్ధంగా పూజలు నిర్వహించారు. తెలంగాణ జానపద గీతాలు ఆలపిస్తూ, బతుకమ్మల చుట్టూ తిరుగుతూ ఆడిపాడారు. మహిళల ఆటపాటలు, కోలాహలంతో వార్డులో పండుగ వాతావరణం నెలకొంది.ఈ సందర్భంగా కౌన్సిలర్ పులిమామిడి మమత మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని పేర్కొన్నారు. ప్రకృతిని, పూలను ఆరాధిస్తూ జరుపుకునే ఈ పండుగ మహిళల మధ్య ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తుందని అన్నారు. ప్రతి ఒక్కరూ మన సంస్కృతి సంప్రదాయాలను కాపాడుకుంటూ, భావితరాలకు వాటి గొప్పతనాన్ని తెలియజేయాలని ఆమె ఆకాంక్షించారు. వార్డు ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. ఈ  వేడుకల్లో చీలం మాధవి, జి. మాధవి గౌడ్, శశికళ, లలిత, స్వరూప, రేణుక, అవంతిక, రాధబాయి, మంజు తదితరులతో పాటు 12వ వార్డుకు చెందిన మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్దుల బతుకమ్మ సంబురాలను విజయవంతం చేశారు.