BREAKING
హెల్మెట్ ధరించిన ప్రయాణం,సుఖ ప్రయాణం: ఎస్ ఐ అమీర్ మా గ్రామంలో బాల్యవివాహాలు జరగవు - తీర్మానం చేసిన గ్రామసభలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సమక్షంలో టీడీపీలో చేరిన వైసీపీ నేతలు విద్యుత్ కోతలతో రైతాంగ పంటలకు నష్టం జరుగుతోంది నెల్లూరు రూరల్ అభివృద్దే మా లక్ష్యం మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా వర్ధంతి పరిశ్రమల పేరుతో రైతుల కడుపు కొట్టవద్దు: కావలి రైతు సంఘం. శ్రీ నికేతన్ హై స్కూల్ లో బతుకమ్మ సంబరాలు గోదాదేవి అమ్మవారికి వెండి కవచం బహుకరణ పునీత్ గ్రానైట్ ఫ్యాక్టరీలో విషాదం.. నీటి గుంటలో పడి కార్మికుడు మృతి కావలి గురుకుల పాఠశాలలో 'స్వచ్ఛత హి సేవా' – విద్యార్థులకు చెత్త సేకరణపై అవగాహన. రఘురామ కాలుష్యంపై గ్రామస్తుల ఆందోళన ఘనంగా జాతీయ క్రిటికల్ కేర్ దినోత్సవ వేడుకలు ప్రగతి విద్యాలయంలో ముందస్తు బతుకమ్మ సంబరాలు

వృద్ధుల అనుభవం.. సమాజానికి మార్గదర్శనం

Select Suryaa Now
వృద్ధుల అనుభవం.. సమాజానికి మార్గదర్శనం

వృద్ధుల అనుభవం.. సమాజానికి మార్గదర్శనం

సంగారెడ్డిలో ఘనంగా అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలు

సంగారెడ్డి, …సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ–సెర్ప్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా మహిళా సమాఖ్య కార్యాలయంలో జిల్లా వృద్ధ మహిళా సంఘాల సభ్యులతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా అదనపు డిఆర్డిఓ  సూర్యరావు, కార్యక్రమ ప్రత్యేక అధికారి సురేఖతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, ప్రథమ్ ఎన్జీవో ప్రతినిధులు హాజరయ్యారు.ఈ సందర్భంగా వృద్ధుల హక్కులు, వారికి అందుబాటులో ఉన్న చట్టాలు, సంపూర్ణ ఆరోగ్యం, కుటుంబంలో వృద్ధులకు లభించాల్సిన గౌరవం, వృద్ధాప్యంలో ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించారు. మహిళా సంఘాల సభ్యులు తమ జీవిత అనుభవాలను, సాధించిన విజయాలను కార్యక్రమంలో పంచుకున్నారు. అనంతరం పలువురు వృద్ధ మహిళలను ఘనంగా సత్కరించారు.

వృద్ధులు కుటుంబానికి, సమాజానికి ఆస్తి

ఈ సందర్భంగా అదనపు డిఆర్డిఓ సూర్యరావు మాట్లాడుతూ వృద్ధులు కుటుంబానికి, సమాజానికి విలువైన ఆస్తి వంటివారని అన్నారు. వారి అనుభవం, జ్ఞానం యువతకు మార్గదర్శకంగా నిలుస్తుందని పేర్కొన్నారు. వృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలపై అవగాహన కల్పించారు.వృద్ధుల ఆరోగ్యం, సంక్షేమం పట్ల కుటుంబ సభ్యులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు. వృద్ధుల సమస్యలను అడిగి తెలుసుకుని, వారికి అవసరమైన సహాయ సహకారాలు అందించాలని సూచించారు.వివో ఎస్సై జి వృద్ధ మహిళలకు నిరంతరం అండగా నిలుస్తూ “మీకు మేమున్నాం” అనే భరోసా కల్పించాలని సూచించారు. వృద్ధ మహిళలను సమాజంలో గౌరవప్రదంగా, ఆత్మగౌరవంతో జీవించేలా సహకరించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా సమాఖ్య ప్రతినిధులు, డీపీఎంలు, ఏపీఎంలు, సీసీలు, వీఓలు, జిల్లా సమాఖ్య సిబ్బంది, మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.