BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

వార్డు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

Select Suryaa Now
వార్డు సమస్యలను తక్షణమే పరిష్కరించాలి

 
ఇల్లందు సూర్య ప్రతినిధి : 

మున్సిపాలిటీలోని 13వ వార్డులో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అవార్డు కౌన్సిలర్ దండు సారయ్య అన్నారు. బుధవారం మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ దొడ్డ కిరణ్ మిత్ర డానియల్, వైస్ చైర్మన్ పెండేలా రాజు లను కలిసి వార్డులో నెలకొన్న సమస్యలపై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కౌన్సిలర్ సారయ్య మాట్లాడుతూ వార్డులో మంచినీటి సరఫరా ,పారిశుద్ధ్యం, కోతులు, వీధి కుక్కలు, సెంట్రల్ లైటింగ్, వీధిలైట్ల సమస్యలను తక్షణమే పరిష్కరించే విధంగా ఆ చర్యలు తీసుకోవాలన్నారు. కొన్ని ప్రాంతాల్లో మెచ్యూరిటీ సరఫరాలు అంతరాయాలు ఏర్పడుతున్నాయని సంబంధిత సిబ్బందితో క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించి పైపులైన్ల లీకేజీ, మోటార్లు సరఫరా వ్యవస్థలో ఉన్న సాంకేతిక సమస్యలను గుర్తించి మరమ్మతులు చేపట్టాలన్నారు. పలు ప్రాంతాల్లో చెత్తాచెదారం పేరుకుపోవడం, మురుగు కాలువలు సక్రమంగా శుభ్రంగాక పోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయి అన్నారు. మురుగు కాలువలను శుభ్రపరచకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగి పలు వ్యాధులకు ప్రజలు గురవుతున్నారన్నారు. కోతుల బెడద, వీధి కుక్కల నియంత్రణకు నిబంధనలు ప్రకారం చర్యలు చేపట్టాలన్నారు. ప్రజల నుండి వచ్చే ఫిర్యాదులపై తక్షణమే స్పందించేలా సిబ్బందికి పలు సూచనలు చేయాలన్నారు. ప్రజా ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పై సమస్యలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

ఇల్లందు సూర్య రూరల్ రిపోర్టర్ డానియల్