ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న మర్రి శశిధర్ రెడ్డి
సికింద్రాబాద్ మేజర్ న్యూస్ : దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఈరోజు సాయంత్రం మర్రి శశిధర్ రెడ్డి లష్కర్ లోని శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ డివిజన్ అధ్యక్షులు సందీప్ వర్మ, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కార్యవర్గ సభ్యులు వి. దయానంద్ రావు, ఆకుల ప్రతాప్, నర్సింగ్ యాదవ్, రమేష్, ఎన్. చంద్రపాల్ రెడ్డి, మహంకాళి సికింద్రాబాద్ జిల్లా కౌన్సిల్ సభ్యులు మరియు జిల్లా కార్యవర్గ సభ్యులు గుంటి సత్యనారాయణ, ఇతర నాయకులు శ్రవణ్, సూర్యవంశీ తదితరులు పాల్గొన్నారు.