BREAKING
గార మండలంలో ఘనంగా అంగన్వాడీ ఉత్సవాలు... గూనపాలెం సెక్టార్‌లో ఘనంగా జాతీయ పోషణ మాసం వజ్రపుకొత్తూరులో ఎస్‌ఎంసీ చైర్మన్లు ఏకగ్రీవం. గూగుల్, ఎన్విడియా ఉత్పత్తులపై పడనున్న తీవ్ర ప్రభావం! గిరిజన అభివృద్ధికి సమన్వయ కృషి అవసరం అధ్వానంగా వాడ్రేవుపల్లి – చాకలిపాలెం ప్రధాన రహదారి: భారీ గుంతలతో వాహనదారులకు నిత్యం ప్రమాదాల ముప్పు గిరిజన సమస్యలు స్థానికంగానే పరిష్కారం కావాలి. యుఎస్ వ్యాప్తంగా నిలిచిపోయిన స్పాటిఫై మ్యూజిక్ స్ట్రీమింగ్ నరసన్నపేటలో ఆగని ఆక్రమణలు! క్యూఆర్ కోడ్ స్కానింగ్ సమస్యలపై డీలర్లతో డీఎస్‌ఓ సమావేశం మాజీ ఎంపీపీలు, జెడ్పీటీసీలకు వైఎస్సార్‌సీపీ సన్మానం.. వరి పంట పొలాలను పరిశీలించిన శాస్త్రవేత్తలు.. చక్కెర ఉత్పత్తిపై వాతావరణ తీవ్ర ప్రభావం, అంతర్జాతీయంగా ధరల మంట! శాంతిభద్రతల పరిరక్షణలో కానిస్టేబుళ్ల పాత్ర కీలకం.. మన్నెమాల ఆధ్వర్యంలో వందలాది కార్లలో తరలి వెళ్లిన జన సైనికులు---మన్నెమాల సుకుమార్ రెడ్డి

టిష్యూ కల్చర్ అరటికి రెండేళ్ల పాటు రాయితీ

Select Suryaa Now
టిష్యూ కల్చర్ అరటికి రెండేళ్ల పాటు రాయితీ


*ఎకరాకు రూ.28 వేల వరకు ఆర్థిక ప్రోత్సాహకం
*ఉద్యాన శాఖ అధికారి ఎం.ఏ. సత్తార్

వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 28): జిల్లాలో టిష్యూ కల్చర్ అరటి సాగును ప్రోత్సహించేందుకు సమీకృత ఉద్యాన అభివృద్ధి మిషన్ (MIDH) పథకం కింద రైతులకు రెండేళ్ల పాటు రాయితీ అందిస్తున్నట్లు జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి ఎం.ఏ. సత్తార్ తెలిపారు. టిష్యూ కల్చర్ అరటి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.పథకం కింద టిష్యూ కల్చర్ అరటి సాగు చేసే రైతులకు మొదటి సంవత్సరం ఎకరాకు రూ.16,800, రెండో సంవత్సరం ఎకరాకు రూ.11,200 చొప్పున రాయితీ అందుతుందని తెలిపారు. రెండు సంవత్సరాలకు కలిపి ఎకరాకు మొత్తం రూ.28,000 వరకు రాయితీ లభిస్తుందని పేర్కొన్నారు.

*ఏకరీతి పెరుగుదలతో ప్రయోజనాలు

టిష్యూ కల్చర్ విధానంలో ఉత్పత్తి చేసిన నాణ్యమైన, ఆరోగ్యకరమైన మొక్కలను నాటడం వల్ల తోటలో మొక్కల పెరుగుదల ఏకరీతిగా ఉంటుందని అధికారులు తెలిపారు. మొక్కలు ఒకే వయస్సు, పరిమాణంతో పెరగడంతో తోట నిర్వహణ సులభతరం కావడంతో పాటు ఒకే సమయంలో పంట కోతకు వచ్చే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. దీంతో మార్కెటింగ్ కూడా సులభంగా ఉంటుందని తెలిపారు.నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలతో మంచి నాణ్యత కలిగిన పండ్లు, గెలలు పొందే అవకాశం ఉంటుందని, ఆరోగ్యకరమైన నాట్లను వినియోగించడం ద్వారా కొన్ని వ్యాధుల వ్యాప్తి ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని వివరించారు.

*సాగులో జాగ్రత్తలు అవసరం
అరటి సాగుకు మంచి నీటి పారుదల కలిగిన నేలను ఎంపిక చేసుకోవాలని, ముందుగా నేల పరీక్ష చేయించి దాని ఆధారంగా ఎరువుల యాజమాన్యం చేపట్టాలని సూచించారు. నాణ్యమైన టిష్యూ కల్చర్ మొక్కలను ఎంపిక చేసి, సిఫార్సు చేసిన దూరంలో నాటాలని తెలిపారు. నీటి వినియోగాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు డ్రిప్ ఇరిగేషన్‌ను వినియోగించడం ప్రయోజనకరమని పేర్కొన్నారు.మొక్కల పెరుగుదల దశకు అనుగుణంగా పోషకాలను అందించడంతో పాటు కలుపు నివారణ, పిలకల తొలగింపు, మట్టి ఎగదీత వంటి చర్యలను సకాలంలో చేపట్టాలని సూచించారు. పురుగులు, తెగుళ్ల నియంత్రణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు పాటించాలని, గెలలు ఏర్పడిన అనంతరం నాణ్యతను కాపాడేందుకు గెలల కవరింగ్ వంటి పద్ధతులను అవలంబించాలని తెలిపారు.వికారాబాద్ జిల్లాలో అరటి సాగుపై ఆసక్తి ఉన్న రైతులు మరిన్ని వివరాల కోసం సమీపంలోని ఉద్యాన శాఖ అధికారులను సంప్రదించాలని ఎం.ఏ. సత్తార్ కోరారు.