ప్రత్యేక పూజల్లో పాల్గొన్న పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి
రామచంద్రపురం ;రామచంద్రాపురం డివిజన్లోని మల్లికార్జున నగర్, శేరిలింగంపల్లి నియోజకవర్గం భారతి నగర్ డివిజన్లోని ఓల్డ్ ఎంఐజీ కాలనీలో థాకూర్ సింగ్ ఆధ్వర్యంలో, బీహెచ్ఈఎల్ టౌన్షిప్లో నిర్వహించిన వివిధ దేవి నవరాత్రి ఉత్సవాల్లో పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జ్ వెన్నవరం ఆదర్శ్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన అన్నప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి మాట్లాడుతూ, దేవి నవరాత్రులు అమ్మవారి శక్తి, వైభవానికి ప్రతీకలని, అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ప్రజల్లో భక్తిభావాన్ని, ఐక్యతను పెంపొందించడంతో పాటు మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.ఈ కార్యక్రమాల్లో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు జగన్నాధ్ రెడ్డి, పరమేశ్ యాదవ్, భాస్కర్ ముదిరాజ్, చిన్న, సురేందర్, సంపత్ గౌడ్, రాకేష్ రెడ్డి, వేణు తదితరులు పాల్గొన్నారు.నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహిస్తున్న నిర్వాహకులకు, భక్తులకు ఆదర్శ్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు.