BREAKING
ప్రజాస్వామ్యాన్ని అపహాసం చేస్తున్న వైసిపి దర్శి లో వైసీపీ నాయకుల బరితెగింపు. వైసిపి నుండి జనసేన లోనికి భారీ చేరికలు టీడీపీ చైర్మన్ అభ్యర్థిగా వజ్జ గంగాభవాని నామినేషన్ దాఖలు ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన,ఏలే చంద్రశేఖర్* కడపలో బిజెపి అభ్యర్థి పై తెలుగుదేశం పార్టీ నాయకులు దాడులు అభ్యర్థుల ఎంపికలో అన్ని వర్గాలకు సమన్యాయం కూటమికి కాపుల సంపూర్ణ మద్దతు: ఆరేటి ప్రకాష్ సూర్యునిపై తేజోమయుడు.. చంద్రునిపై చల్లనయ్య..! – తుమ్మలగుంటలో వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు వైసీపీని వీడి టిడిపిలో చేరిక అగ్నిప్రమాద బాధిత కుటుంబానికి ఆర్థిక సాయం గెలుపే లక్ష్యంగా పనిచేయాలి.. అది పొరపాటే.. స్థానిక ఎన్నికల వేళ జిల్లాలో ముమ్మరంగా కార్డెన్ సెర్చ్ కలసపాడులో ఘనంగా వాసవీమాత నవరాత్రి ఉత్సవాలు అద్దంకిలో జోరందుకున్న టీడీపీ ప్రచారం. ఇంటింటికీ తిరుగుతూ ఓట్ల అభ్యర్థన.

కౌంటింగ్‌కు అంతా సిద్ధం

Select Suryaa Now
కౌంటింగ్‌కు అంతా సిద్ధం

ఎడ్యుకేషన్ స్టాఫ్ రిపోర్టర్ : నగరపాలక సంస్థ స్థానిక ఎన్నికల నిర్వహణలో భాగంగా ఓట్ల లెక్కింపు కోసం శ్రీవేంకటేశ్వర ఆర్ట్స్ కళాశాలలో ఏర్పాటుచేసిన కౌంటింగ్ కేంద్రాలను నగరపాలక సంస్థ కమిషనర్ జయకృష్ణ ఆదివారం అధికారులతో కలిసి పరిశీలించారు. 30వ తేదీన జరగనున్న కౌంటింగ్ కోసం కళాశాలలో ఓట్ల లెక్కింపు కోసం గుర్తించిన గదులను, కౌంటింగ్ సామాగ్రిని, ఏర్పాటు చేసిన కౌంటింగ్ హాళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రతి వార్డుకు కేటాయించిన టేబుల్స్, వార్డు నంబర్, పీఎస్ నంబర్లతో నేలపై వేసిన మార్కింగ్‌లు, భద్రత కోసం ఏర్పాటు చేసిన ఇనుప బారికేడ్లు, ఫెన్సింగ్‌లను పరిశీలించారు. కౌంటింగ్ రోజున ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అమరయ్య, సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, సర్వేయర్ గురువారెడ్డి, డీఈ మహేష్ పాల్గొన్నారు.

 

సీఎం గౌడ్ తిరుపతి స్టాఫ్ రిపోర్టర్