గరుడ రమేష్ నిబద్ధతకు గుర్తింపు.. 32వ వార్డు కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియామకం
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తా.. గరుడ రమేష్
ఖమ్మం రూరల్ సూర్య మేజర్ న్యూస్ :
కాంగ్రెస్ పార్టీ పట్ల చూపుతున్న నిబద్ధత, పార్టీ కార్యక్రమాల్లో చురుకైన భాగస్వామ్యానికి గుర్తింపుగా గరుడ రమేష్కు కీలక బాధ్యత లభించింది. ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని 31వ వార్డుకు చెందిన కాంగ్రెస్ నాయకుడు గరుడ రమేష్ కు ఆదివారం కీలక గౌరవం దక్కింది .ఆదివారం స్థానిక జీవీఆర్ ఫంక్షన్ హాల్లో మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన నియామకాల కార్యక్రమంలో మున్సిపాలిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బానోతు కిషోర్ 32వ వార్డు అధ్యక్షుడిగా గరుడ రమేష్ నియామకాన్ని ప్రకటించారు.ఈ సందర్భంగా గరుడ రమేష్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నియామకం తనపై మరింత బాధ్యతను పెంచిందని, పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ప్రతి కార్యకర్తను కలుపుకొని ముందుకు సాగుతూ, కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని స్పష్టం చేశారు.తన నియామకానికి సహకరించిన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్చార్జి తుంబూరు దయాకర్ రెడ్డికి ఈ సందర్భంగా గరుడ రమేష్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.గరుడ రమేష్ నియామకంపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మిత్రులు, శ్రేయోభిలాషులు హర్షం వ్యక్తం చేశారు. నూతన బాధ్యతల్లో ఆయన మరింత చురుకుగా పనిచేస్తూ పార్టీకి సేవలందించాలని ఆకాంక్షించారు.