సోదర భావంతోనే పండుగలు జరుపుకోవాలి
జిన్నారం :బొల్లారం డివిజన్ పరిధిలోని వై ఎస్ ఆర్ కాలనీలో ముస్లిం మైనార్టీ నాయకులు శుక్రవారం గ్యార్మి వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకల్లో మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాల్గొన్నారు.ఈ సందర్భంగా మైనార్టీ సోదరులు అబ్దుల్ నబీ తో కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం మాజీ జడ్పిటిసి బాల్ రెడ్డి మాట్లాడుతూ... సోదర భావంతో పాటు మతసామరస్యానికి పండుగలు నిదర్శనంగా నిలుస్తాయని కొనియాడారు. ముస్లిం మైనార్టీ సోదరులకు గ్యార్మి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. మైనార్టీ సోదరులు నాయకులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు వి .వేణు పాల్ రెడ్డి, సాయి కిరణ్ రెడ్డి, శ్రీకాంత్ యాదవ్, సతీష్ మాజీ ఎంపీటీసీలు రత్నం, మునీర్ మైనార్టీ నాయకులు కాసిం ,ఖలీల్, తాహిర్, సలీం, ఆఫీస్, కాలనీవాసులు, తదితరులు పాల్గొన్నారు.