షేర్ శంకర్ తాండాలో అభివృద్ధి పనుల పరిశీలన
సూర్య రాజంపేట :రాజంపేట మండలంలోని షేర్ శంకర్ తాండాలో ఎంపీడీవో బి. సూర్యాజీ పర్యటించారు. ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల పథకం ఫేజ్–2 లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. గ్రామంలో పారిశుధ్య పనులు, వీబీజీ రామ్జీ పథకం కింద చేపడుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కాట్రోత్ భద్రు, ఉపసర్పంచ్ మాలోత్ బలరాం, పంచాయతీ కార్యదర్శి జి. స్వాతి, గ్రామస్తులు పాల్గొన్నారు.