BREAKING
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల నగదు, వస్తువులు బూడిదపాలు

Select Suryaa Now
షార్ట్‌సర్క్యూట్‌తో ఇల్లు దగ్ధం.. రూ.50 వేల నగదు, వస్తువులు బూడిదపాలు

యాలాల, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): యాలాల మండలం రాస్నం గ్రామంలో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా కుమ్మరి బుచ్చమ్మకు చెందిన ఇల్లు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో ఇంట్లోని వస్తువులతో పాటు దాచుకున్న రూ.50 వేల నగదు కాలిపోయినట్లు బాధితురాలు తెలిపింది. నిరుపేద కుటుంబానికి చెందిన బుచ్చమ్మ పింఛన్‌ డబ్బులను పొదుపు చేసుకొని దాచుకోగా, అగ్నిప్రమాదంలో నగదుతో పాటు విలువైన వస్తువులు బూడిదపాలయ్యాయి. దీంతో ఆమె కుటుంబం తీవ్ర ఇబ్బందుల్లో పడింది.

బాధితురాలిని ఆదుకోవాలని నాయకుల వినతి

అగ్నిప్రమాదంతో సర్వం కోల్పోయిన బుచ్చమ్మను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని పలువురు నాయకులు తహసీల్దార్‌ (ఎమ్మార్వో)ను కలిసి వినతిపత్రం సమర్పించారు. బాధితురాలి ఇంటిని క్షేత్రస్థాయిలో పరిశీలించి, జరిగిన నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్థిక సాయం అందించాలని కోరారు. నిరుపేద కుటుంబానికి అండగా నిలిచి, తిరిగి జీవనం సాగించేందుకు అవసరమైన సహాయం అందించాలని విజ్ఞప్తి చేశారు.

వివరణ కోరినా స్పందించని ఎమ్మార్వో

బాధితురాలికి ప్రభుత్వ పరంగా అందించే సహాయం, ప్రమాదానికి సంబంధించిన వివరాలపై వివరణ కోరేందుకు రిపోర్టర్‌ ఎమ్మార్వోకు ఫోన్‌ చేసినప్పటికీ స్పందన రాలేదు. అగ్నిప్రమాదంతో ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయిన బుచ్చమ్మ కుటుంబాన్ని సంబంధిత అధికారులు వెంటనే పరామర్శించి, నష్టాన్ని అంచనా వేసి తగిన సహాయం అందించాలని గ్రామస్థులు కోరుతున్నారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో స్పందించి బాధితురాలికి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

రిపోర్టర్:ప్రకాష్ గౌడ్, యాలాల, వికారాబాద్ జిల్లా.