BREAKING
సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జర్నలిస్టులపై అణచివేత...భారత ప్రభుత్వ తీరుపై మీడియా సంస్థల తీవ్ర ఆరోపణలు సన్నీ డియోల్ ‘సూర్యా’ ఫస్ట్ లుక్.. నెట్టింట తెగ వైరల్ అవుతున్న రగ్డ్ లుక్! బుచ్చిలో వైసీపీ మైనారిటీలకు పెద్దపీట.. చైర్ పర్సన్ గా షేక్ షకీలా బేగం.. కాంగ్రెస్ మాటల చేతలకు పొంతన లేదు :0పెరమోని నరేష్ యాదవ్ 25 మంది వృద్ధులకు అన్నదానం రబిలో ఆరుతడి పంటలే మేలు! గ్రైండర్ డేటా షేరింగ్ వివాదం...మైక్రోసాఫ్ట్ 'జాండర్' సంస్థకు నార్వే భారీ జరిమానా ఈవోని కలిసిన దేవస్థాన కమిటీ సభ్యుడు బీజేవైఎం నారాయణపేట జిల్లా ఉపాధ్యక్షులుగా మణి మోదీ వెంకటేశ్వర దేవాలయం కు ఎమ్మెల్యే శంఖు స్థాపన అన్నపూర్ణా దేవి అలంకారంలో కన్యకా పరమేశ్వరి అమ్మవారు పొదలకూరు దశ, దిశ మారుస్తోన్న సోమిరెడ్డి ప్రకృతి విధ్వంసానికి కారణమవుతున్న ప్రోత్సాహకాలే అసలు సమస్య కాశీబుగ్గ డీఎస్పీగా జీవీ రమణ బాధ్యతల స్వీకరణ.

సేవలను అభినందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా - హోంగార్డు వెంకటికి ఘన సన్మానం

Select Suryaa Now
సేవలను అభినందించిన సీపీ అంబర్ కిషోర్ ఝా - హోంగార్డు వెంకటికి ఘన సన్మానం
సూర్య, లక్షెట్టిపేట :మంచిర్యాల జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో హోంగార్డు లక్షెట్టిపేట గ్రామానికి చెందిన వెంకటి ఉద్యోగ విరమణ సందర్భంగా ప్రత్యేక వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ముఖ్య అతిథిగా హాజరై, పదవీ విరమణ పొందిన హోంగార్డు వెంకటిని శాలువాతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. పోలీస్ శాఖలో విధులు నిర్వహిస్తూ వెంకటి అందించిన సేవలు అభినందనీయమని కొనియాడారు. ఉద్యోగ బాధ్యతలను అంకితభావంతో నిర్వర్తిస్తూ శాఖకు ఎంతో సేవ చేశారని తెలిపారు. పదవీ విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షించారు. పోలీస్ శాఖలో పనిచేసే ప్రతి ఉద్యోగి సేవలు ఎంతో విలువైనవని, విధి నిర్వహణలో నిబద్ధతతో పనిచేసిన వారిని శాఖ ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనరేట్ అధికారులు, సిబ్బంది, హోంగార్డు వెంకటి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.