BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

సేవా సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల సన్మానం..

Select Suryaa Now
సేవా సంపర్క్ అభియాన్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్ల సన్మానం..

కుల్కచర్ల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 30):సేవా సంపర్క్ అభియాన్‌లో భాగంగా కుల్కచర్ల మండలంలోని చెల్లాపూర్ గ్రామ అంగన్వాడీ కేంద్రంలో అంగన్వాడీ టీచర్లను ఘనంగా సన్మానించారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినాన్ని పురస్కరించుకుని, ఆయన ప్రజాసేవకు కృతజ్ఞతగా నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. సేవా సంపర్క్ అభియాన్ మండల కన్వీనర్ మల్లేష్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్లు శకుంతలమ్మ, రాములమ్మలను సన్మానించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో అంగన్వాడీ టీచర్లు చిన్నారులకు విద్య, ఆరోగ్యం, పౌష్టికాహారం అందించడంతో పాటు గర్భిణీలు, బాలింతలకు ఆరోగ్యం, పౌష్టికాహారంపై అవగాహన కల్పిస్తూ అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ కుల్కచర్ల మండల ఉపాధ్యక్షుడు కొండ ఆంజనేయులు, ఎస్సీ మోర్చా మండల అధ్యక్షుడు బెందూర్ ఆంజనేయులు, మాజీ ఉపసర్పంచ్ పర్వతపురం వెంకటయ్య, కొండ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.