సద్దుల బతుకమ్మ, దసరా ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని-శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు-గణపురం ఎస్సై బోరగాల అశోక్
గణపురం, మేజర్ న్యూస్, సద్దుల బతుకమ్మ, దసరా పండుగలను మండల ప్రజలు శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని గణపురం ఎస్ఐ బోరగాల అశోక్ సూచించారు. ఆదివారం సద్దుల బతుకమ్మ, మంగళవారం దసరా వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసు శాఖ అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు.
గ్రామాల్లో ఎవరైనా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ అనవసర గొడవలకు తెరతీస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మద్యం మత్తులో అల్లర్లు, గొడవలు చేస్తూ ఇతరులకు ఇబ్బందులు కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు. మండల వ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై తనిఖీలు నిర్వహిస్తామని, మద్యం తాగి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రతి గ్రామంలో పోలీసుల నిఘా ఉంటుందని, ప్రజలందరూ ప్రశాంతంగా పండుగలను జరుపుకోవాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్ఐ అశోక్ విజ్ఞప్తి చేశారు.
రిపోర్టర్: ఎల్లయ్య, గణపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా