రైతుల సంక్షేమం, మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేయాలి: పట్నం మహేందర్‌రెడ్డి
తాండూరు, మేజర్ న్యూస్ (అక్టోబర్ 12): రైతుల సంక్షేమంతో పాటు మార్కెట్ కమిటీ అభివృద్ధికి నూతన పాలకవర్గం కృషి చేయాలని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి సూచించారు. రైతులకు మెరుగైన సేవలు అందిస్తూ మార్కెట్ కమిటీని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు.సోమవారం తాండూరు పట్టణంలోని తన నివాసంలో కోట్పల్లి మార్కెట్ కమిటీ చైర్‌పర్సన్ అనితా బాయి రమేష్ నాయక్, వైస్ చైర్‌పర్సన్ మధులత శ్రీనివాస్ చారి తదితరులు పట్నం మహేందర్‌రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. బుధవారం నిర్వహించనున్న ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరుకావాలని ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన నూతన చైర్‌పర్సన్, వైస్ చైర్‌పర్సన్‌లను అభినందించారు.మార్కెట్ కమిటీ అభివృద్ధికి, రైతుల సంక్షేమానికి తనవంతు పూర్తి సహకారం అందిస్తానని పట్నం మహేందర్‌రెడ్డి తెలిపారు. రైతులకు అవసరమైన సదుపాయాల కల్పనతో పాటు మార్కెట్ కమిటీని మరింత అభివృద్ధి చేసేందుకు పాలకవర్గం సమష్టిగా కృషి చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ సర్ కన్వీనర్ కరణం పురుషోత్తంరావు, సీనియర్ జర్నలిస్టులు శ్రీనివాస్ చారి, పి.రామచందర్ తదితరులు పాల్గొన్నారు.