telanagana
రైతుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలి పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్
సూర్య, తిర్యాణి : తిర్యాణి, సహకార సంఘం అభివృద్ధితో పాటు రైతుల ఆర్థికాభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని పీఏసీఎస్ చైర్మన్ చుంచు శ్రీనివాస్ అన్నారు. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా తిర్యాణి మండలంలోని సహకార సొసైటీ కార్యాలయంలో నిర్వహించిన మహాజన సభలో ఆయన పాల్గొని మాట్లాడారు.
రైతులకు అవసరమైన విత్తనాలు, యూరియా, డీఏపీ ఎరువులు, వ్యవసాయ రుణాలు సకాలంలో అందేలా అధికారులు, సిబ్బంది కృషి చేయాలని కోరారు. రైతుల సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని, ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు వారికి అందేలా చూడాలని సూచించారు. రైతుల అభ్యున్నతికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు.సమావేశంలో సంఘ కార్యకలాపాలు, ఆదాయ వ్యయాల ఆమోదం, రుణాల మంజూరు, సకాలంలో తిరిగి చెల్లించడం తదితర అంశాలపై చర్చించారు. రైతు ఉత్పత్తిదారుల సంస్థ (ఎఫ్‌పీఓ) గురించి సభ్యులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పీఏసీఎస్ వైస్ చైర్మన్, డైరెక్టర్లు, సంఘ సిబ్బంది, బ్యాంకు మేనేజర్, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.