telanagana
ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపిన నూతన పాక్స్ చైర్మన్లు
సూర్య - కథలాపూర్ :మండలంలోని నూతనంగా ఎన్నికైన పాక్స్ చైర్మన్లు ఆదివారం వేములవాడ లో ప్రభుత్వ విప్ వేములవాడ నియోజక వర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ను కలిసి కృతఙ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా గంబీర్ పూర్, భూషణ్ రావు పేట ఛైర్మన్ లు అల్లూరి దేవ రెడ్డి,గడ్డం స్వామి రెడ్డి లు శాలువ తో సన్మానం చేశారు.ఈ సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వెలిచాల సత్య నారాయణ, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అజీమ్, మాజీ అధ్యక్షుడు నాగరాజు, పాక్స్ సభ్యులు, మార్కెట్ కమిటీ సభ్యుడు,కార్యకర్తలు ఉన్నారు.