BREAKING
రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటి.. మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న బ్రిటిష్ బ్యూటీ! భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణకు ఆర్థిక పరీక్షలు ఖత్రోన్ కే ఖిలాడీ 15 విజేతగా అవినాష్ మిశ్రా.. ట్రోఫీతో పాటు రూ.20 లక్షలు, కారు గెలుచుకున్న నటుడు! ఏఐ వీడియోల దుర్వినియోగంపై హీరోయిన్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది లైంగిక వేధింపులతో సమానం! చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు! నేడు స్విస్ అధ్యక్షుడు గై పార్మెలిన్ భారత పర్యటన పెగ్గెర్ల గ్రామానికి నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు బిగ్‌బాస్ హౌస్‌లో సంచలనం.. ఊహించని విధంగా ఆమె ఎలిమినేషన్.. సండే ఎపిసోడ్ హైలైట్స్ ఇవే! ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు కృతఙ్ఞతలు తెలిపిన నూతన పాక్స్ చైర్మన్లు కలిగోట సూరమ్మ ప్రాజెక్టు ను సందర్శించిన బిజెపి కిమోరా అధికార ప్రతినిధి కోడిపల్లి Gold Rates Today: గోల్డ్ ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు.. ఇవాళ తులం ఎంతంటే? భారత రైతులకు ఏఐ ద్వారా సరికొత్త సాధికారత: ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడు అజయ్ బంగా ట్రంప్ పదవీకాలం ముగిసినా ఇరాన్ యుద్ధ సంక్షోభం కొనసాగే ప్రమాదం బ్రిటన్ రాజకీయాల్లో సంచలనం ఎన్‌‌సీసీ క్యాడెట్లకు భారత సైన్యం ప్రత్యేక శిక్షణ

భూమికోసం ఆగిన రైతు గుండె..!

Select Suryaa Now
భూమికోసం ఆగిన రైతు గుండె..!
  • 4 ఎకరాల కోసం అధికారుల చుట్టూ తిరిగి రైతు మృతి
  • MRO, RI పై గ్రామస్తుల ఆరోపణలు
  • సమగ్ర విచారణకు డిమాండ్

తమ కుటుంబానికి చెందిన నాలుగు ఎకరాల భూమి రికార్డుల్లో మారిపోయిందంటూ అధికారుల చుట్టూ తిరిగిన ఓ పేద రైతు గుండెపోటుతో మృతి చెందిన ఘటన షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడలో విషాదం నింపింది. గ్రామానికి చెందిన వారణాసి యాదయ్య (50) సర్వే నంబర్ 483లో తమ కుటుంబానికి ఉన్న నాలుగు ఎకరాల లావణి భూమి రికార్డుల్లో లేకుండా పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.భూమి కోసం గత రెండు నెలల నుండి ఎమ్మార్వో, ఆర్డీవో కార్యాలయాల చుట్టూ తిరిగినా సమస్య పరిష్కారం కాలేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన యాదయ్య శనివారం అర్ధరాత్రి గుండెపోటుతో మృతి చెందినట్లు పేర్కొన్నారు.ఈ భూమిని రెవెన్యూ అధికారులు ఆర్ఐ విజయ్‌కుమార్ బంధువుల పేర్లకు మార్చినట్లు గ్రామస్తులు ఆరోపిస్తూ, సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. యాదయ్య మృతికి అధికారుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ సీఎం రేవంత్‌రెడ్డి స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరుతున్నారు.

విచారణ జరిపి చర్యలు: తహశీల్దార్
భూసేకరణలో భూములు కోల్పోయిన అర్హులందరికీ ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం అందేలా చూస్తామని తహశీల్దార్ ఎండి అన్వర్ తెలిపారు. ఆర్ఐ విజయ్‌కుమార్‌పై వచ్చిన ఆరోపణలపై విచారణ జరిపి అవి నిజమని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ఆరోపణలు అవాస్తవం: ఆర్ఐ
తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని ఆర్ఐ విజయ్‌కుమార్ తెలిపారు. యాదయ్య కుటుంబానికి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం అందేలా సహకరిస్తామని పేర్కొన్నారు.

 

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 05)