BREAKING
తిరుమల అలిపిరి నడకమార్గంలో చిరుత సంచారం: భక్తులకు హెచ్చరిక స్నాప్‌డీల్ మాతృ సంస్థ ఏస్‌వెక్టర్ ఐపీవో ఎంట్రీ, తొలి రోజే పడిపోయిన షేర్లు 4 జిల్లాల్లో డీపీవో, డ్వామా పీడీల నియామకం యాక్సెంచర్ అంచనాలతో జోరుగా ఐటీ స్టాక్స్ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కొత్త సీఈవో నియామకం, దూసుకెళ్తున్న షేర్లు దేశీయ ఎఫ్‌ఎంసీజీ దిగ్గజం మారికో జోరు పోలీసులపై కోర్టును ఆశ్రయించిన బ్రిటన్ రాజ కుటుంబీకుడు కింగ్ చార్లెస్ సోదరుడు గూటుపల్లి ముతావలి హాఠన్మరణం నా మంచితనాన్ని ఓవరాక్షన్ అంటున్నారు.. ట్రోవర్లపై హీరోయిన్ రష్మిక మందన్న తీవ్ర ఆగ్రహం! కృష్ణానదిలో గల్లంతైన బాలస్వామి మృతదేహం లభ్యం ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం రాజమౌళి ‘వారణాసి’ చిత్రంలో హాలీవుడ్ స్టార్ నటి.. మహేష్ బాబుతో రొమాన్స్ చేయనున్న బ్రిటిష్ బ్యూటీ! భారత్-చైనా సంబంధాల పునరుద్ధరణకు ఆర్థిక పరీక్షలు ఖత్రోన్ కే ఖిలాడీ 15 విజేతగా అవినాష్ మిశ్రా.. ట్రోఫీతో పాటు రూ.20 లక్షలు, కారు గెలుచుకున్న నటుడు! ఏఐ వీడియోల దుర్వినియోగంపై హీరోయిన్ జాన్వీ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. అది లైంగిక వేధింపులతో సమానం!

చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు!

Select Suryaa Now
చకోర వేడుక: మీరూ మరో పూరి, శివ నిర్వాణ కాగలరు!

సూర్య ఎంటర్‌టైన్‌మెంట్ డెస్క్: టాలీవుడ్‌లో వైవిధ్యమైన కథాంశాలతో రూపొందుతున్న చిత్రాలపై ప్రేక్షకులలో ఎప్పుడూ భారీ అంచనాలుంటాయి. ఆ కోవలోనే ప్రేక్షకుల ముందుకు వస్తున్న తాజా చిత్రం ‘చకోర–లూనార్‌ బర్డ్‌‌’. మంగా శ్రీనివాస్ రచన మరియు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో శ్రవణ్, మలైకా టి. వాసుపల్ జంటగా నటిస్తుండగా, అనుష్క లూహార్ మరో హీరోయిన్‌‌గా కీలక పాత్ర పోషిస్తున్నారు. డా. చింతాడ హేమారావు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ సినిమా అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ విశాఖపట్నంలో ఘనంగా ప్రీ-రిలీజ్ వేడుకను నిర్వహించింది.

వైజాగ్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రముఖ టాలీవుడ్ దర్శకుడు శివ నిర్వాణ ముఖ్య అతిథిగా హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను కూడా వైజాగ్ గడ్డ నుంచే ఇండస్ట్రీకి వచ్చానని, పూరీ జగన్నాథ్, పరశురామ్ వంటి ఎంతోమంది ప్రతిభావంతులు ఇదే ప్రాంతం నుంచి వచ్చి స్టార్ దర్శకులుగా ఎదిగారని గుర్తుచేశారు. ఇప్పుడు ఇదే బాటలో మంగా శ్రీనివాస్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారని తెలిపారు. ప్రేక్షకులు తమలోని సృజనాత్మకతను గుర్తించాలని, అప్పుడే మీ నుంచి కూడా మరో పూరి జగన్నాథ్ లేదా శివ నిర్వాణ లాంటి దర్శకులు పుట్టుకొస్తారని ఆయన యువతను ఉత్సాహపరిచారు. చకోర చిత్రంలో నటించిన నటీనటులు ఎంతో ప్రామిసింగ్‌గా కనిపిస్తున్నారని, టెక్నీషియన్లు కూడా మంచి అవుట్‌పుట్ ఇచ్చారని కొనియాడుతూ సినిమా ఘనవిజయం సాధించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో చిత్ర నిర్మాత డా. చింతాడ హేమారావు మాట్లాడుతూ సినిమాపై తమకున్న నమ్మకాన్ని వెల్లడించారు. భిన్నమైన ప్రేమకథతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసి ప్రేక్షకులు అందించే ప్రశంసలు, థియేటర్లలో వారు కొట్టే చప్పట్లే తమకు కోట్లాది రూపాయల ఆస్తితో సమానమని ఆయన పేర్కొన్నారు. కేవలం కమర్షియల్ హంగులకే పరిమితం కాకుండా అందమైన భావోద్వేగాలతో ఈ సినిమాను రూపొందించినట్లు తెలిపారు. వైజాగ్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్‌కు స్థానిక ప్రేక్షకుల నుంచి లభించిన అపూర్వ స్పందన సినిమాపై అంచనాలను మరింత పెంచేలా చేసింది.

దర్శకుడు మంగా శ్రీనివాస్ మాట్లాడుతూ ఇదొక అమ్మ చెప్పిన అందమైన ప్రేమకథ అని, ఒక అబ్బాయి కోణంలో సాగే హృదయాలను హత్తుకునే ప్రయాణమని వివరించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించి నిర్వహించిన ప్రివ్యూ షోలను చూసిన వారు ఫస్టాఫ్ ఎంతో బ్యూటిఫుల్‌గా ఉందని, సెకండాఫ్ వండర్‌ఫుల్‌గా వచ్చిందని ప్రశంసిస్తున్నారని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. నూతన నటీనటులు, అనుభవజ్ఞులైన సాంకేతిక నిపుణుల సమిష్టి కృషితో రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను కచ్చితంగా అలరిస్తుందన్న ధీమాను యూనిట్ వ్యక్తం చేస్తోంది. అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయనున్న ఈ లవ్ అండ్ ఎమోషనల్ ఎంటర్‌టైనర్ ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో వేచి చూడాలి.