4 జిల్లాల్లో డీపీవో, డ్వామా పీడీల నియామకం
రాష్ట్రంలోని నాలుగు జిల్లాల్లో జిల్లా పంచాయతీ అధికారు(డీపీవో)లు, జిల్లా జల యాజమాన్య సంస్థ (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ల (పీడీ)ను ప్రభుత్వం నియమించింది. బొబ్బిలి, కావలి డివిజనల్ డెవలప్మెంట్ అధికారులు (డీడీవో) ఎం. కిరణ్ కుమార్, టి.నగేశ్ కుమార్ లను అనకాపల్లి, బాపట్ల జిల్లా పంచాయతీ అధికారులుగా నియమించారు. తూర్పు గోదావరి, గుంటూరు డ్వామా జిల్లా విజిలెన్స్ అధికారులు ఆర్. విజయరాజు, ఎం. విజయకుమార్లను కాకినాడ, ప్రకాశం డ్వామా ప్రాజెక్టు డైరెక్టర్లుగా నియమించారు త్వరలోనే వీరు వారికి కేటాయించిన జిల్లాలలో పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు.
అనకాపల్లి ప్రతినిధి