ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే అమిలినేనికి ఆహ్వానం
అనంతపురం బ్యూరో : ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావాలని కళ్యాణదుర్గం ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఆహ్వానించారు.
ఈ సందర్భంగా డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. వెంకటేశ్వర్లు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబును ఆయన స్వగృహంలో కలిసి కార్యక్రమానికి సంబంధించిన వివరాలను తెలియజేశారు. ఈ నెల 06వ తేదీన ఉదయం 10 గంటలకు అనంతపురంలోని రెవెన్యూ భవన్, కలెక్టర్ కార్యాలయంలో వర్చువల్ విధానంలో ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రజలకు మెరుగైన వైద్య సేవలను మరింత చేరువ చేయడంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు జరుగుతోందని అధికారులు తెలిపారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై విజయవంతం చేయాలని డీఎంహెచ్‌ఓ కోరారు.