BREAKING
మరోసారి తారక్‌తో జక్కన్న కాంబో: టాలీవుడ్‌‌లో హాట్ టాపిక్‌గా మారిన క్రేజీ ప్రాజెక్ట్ అంగన్వాడీకేంద్రాల్లోఘనంగాఉత్సవంకార్యక్రమం విద్వేషా దూషణలతో కాలక్షేపం చేస్తూ పరిపాలనను గాలికి వదిలేశారు..మాజీ మంత్రి పువ్వాడ ఆరోపణ. అక్టోబర్ 2న థియేటర్లలోకి విభిన్న కథాంశంతో వస్తున్న టాలీవుడ్ మూవీ ఇంప్యూర్ టోరెంట్ ఫార్మాపై మోతీలాల్ ఓస్వాల్ కవరేజ్ ప్రారంభం: 'న్యూట్రల్' రేటింగ్ కేటాయింపు.. కాలేజీనిసమర్ధవంతంగానిర్వహించినకరెస్పాండెంట్రాధాకృష్ణయ్య ఆజాద్ ఇంజనీరింగ్‌కు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ రేటింగ్ అప్‌గ్రేడ్: దీర్ఘకాలిక వృద్ధి దృష్ట్యా పెరిగిన టార్గెట్ మండల స్థాయి కబడ్డీ పోటీల్లో కృష్ణవేణి పాఠశాల విద్యార్థుల విజయదుందుభి! గ్రామీణ ప్రాంతాల్లో చైన్ స్నాచర్ల హల్‌చల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో బీపీఎం రంగంలో భారీ మార్పులు: ప్రపంచ ఇంటెలిజెంట్ ఆపరేషన్స్ హబ్‌గా భారత్.. నాస్కామ్ వెల్లడి LT, HT విద్యుత్ కనెక్షన్లకు యూనిఫాం సర్వీస్ లైన్ ఛార్జీలు – పారదర్శకత, సరళత, వేగవంతమైన సేవలు ఆగస్టులో దేశీయ విమాన ప్రయాణికుల రాకపోకల్లో 7.5 శాతం తగ్గుదల: ఐఏటీఏ నివేదిక వెల్లడి పాపంపేట జెడ్పీ ఉన్నత పాఠశాలకు అదనపు తరగతి గదులు నిర్మించాలి.. బదిలీపై వెళ్లిన ఎస్సీ సంక్షేమ శాఖ అధికారికి సన్మానం తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణుల ప్రభావం పలు ప్రాంతాల్లో వర్షాలు పడతాయని వాతావరణ శాఖ సూచన

పంటలను ఎండబెట్టి.. రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం దగా చేసింది

Select Suryaa Now
పంటలను ఎండబెట్టి.. రైతులను కాంగ్రెస్‌ ప్రభుత్వం దగా చేసింది

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు

నల్గొండ జిల్లా బ్యూరో, మేజర్ న్యూస్:రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నదాతలను మోసం చేసిందని, ప్రభుత్వ వైఫల్యాల కారణంగా వరి పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. రైతుల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు బీజేపీ ప్రతినిధి బృందంతో కలిసి బుధవారం ఆయన నల్గొండ జిల్లాలో పర్యటించారు.

క్షేత్రస్థాయిలో రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవడమే పర్యటన ప్రధాన ఉద్దేశమని రామచందర్‌రావు తెలిపారు. పంటలు నష్టపోయిన రైతుల పరిస్థితులను పరిశీలించి, వారికి బీజేపీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’లో పాల్గొన్న రాష్ట్ర అధ్యక్షుడు

ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్ల ప్రజాసేవను పూర్తి చేసుకున్న సందర్భంగా ‘సేవా సంకల్ప్‌ అభియాన్‌’ నిర్వహిస్తున్నట్లు రామచందర్‌రావు తెలిపారు. ఇందులో భాగంగా నల్గొండలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం స్వచ్ఛత కార్యక్రమంలో స్వయంగా పాల్గొన్నారు.

సేవా భావం, స్వచ్ఛత విస్తృత ప్రజా ఉద్యమంగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రధాని మోదీ స్ఫూర్తితో ప్రతి బీజేపీ కార్యకర్త సమాజ సేవ, దేశ సేవకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.

నాగార్జునసాగర్‌లో రైతులతో భేటీ

నల్గొండ పర్యటన అనంతరం రామచందర్‌రావు నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. అక్కడ పంట నష్టపోయిన రైతులను ప్రత్యక్షంగా కలిసి వారి బాధలు, సమస్యలను అడిగి తెలుసుకోనున్నట్లు తెలిపారు. కష్టాల్లో ఉన్న అన్నదాతలకు భారతీయ జనతా పార్టీ ఎల్లప్పుడూ దృఢంగా అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.