BREAKING
టాలీవుడ్‌లో కొత్త ప్రయోగానికి సిద్ధమవుతున్న ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి ఉద్యానవన ఉత్పత్తులకు మిట్స్ యూనివర్శిటీ ప్రోత్సాహం హ్యాట్రిక్ హీరో శివరాజ్‌కుమార్ ‘Bail’ మూవీ రిలీజ్.. అక్టోబర్ 2న థియేటర్లలోకి పవర్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ బాక్సాఫీస్ వద్ద నాని ‘ది ప్యారడైజ్’ జోరు.. ఎనిమిదో రోజు వసూళ్ల వివరాలు ఇవే విశ్వం కళాశాలలో అట్టహాసంగా గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఉట్కూరు కేజీబీవీ పాఠశాలకు షీల్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డ్ తాను చనిపోయినా.. మరో వ్యక్తికి వెలుగులు నింపాడు ఆదిత్య ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల అద్భుత ప్రతిభ జిమ్‌కు వెళ్లకపోయినా ఫిట్‌గా ఉండొచ్చా? రోజువారీ జీవితంలో కదలికను పెంచే సింపుల్ మార్గాలు ఆరోగ్యంగా ఉండటానికి పెద్ద మార్పులు అవసరం లేదు.. రోజూ చేసే ఈ చిన్న పనులతోనే మొదలు పెట్టండి అత్తిలి ఎస్వీఎస్ఎస్ విద్యాసంస్థల సెక్రటరీ & కరస్పాండెంట్‌గా మద్దాల శ్రీనివాస్ ఏకగ్రీవ ఎన్నిక చిన్నారుల భవిష్యత్తుకు పునాది అంగన్వాడి టీఎంజేఎఫ్ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడిగా వత్తుల రఘుపతి రైలు కిందపడిన వ్యక్తికి తీవ్ర గాయాలు పార్లమెంట్ కార్యాలయ భవన పనుల పరిశీలన

పీఏసీఎస్ అభివృద్ధికి రైతులు తోడ్పాటు అందించాలి

Select Suryaa Now
పీఏసీఎస్ అభివృద్ధికి రైతులు తోడ్పాటు అందించాలి

రైతులు తీసుకున్న రుణాలు సకాలంలో చెల్లించండి

యాచారం పిఎసిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి
మాల్ లో సొసైటీ నూతన భవనం నిర్మాణం 
ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి భూమి పూజకు ఆహ్వానం

: యాచారం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అభివృద్ధికి, బలోపేతానికి రైతులు తోడ్పాటు అందించాలని పిఎసిఎస్ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం యాచారం పీఏసీఎస్ కార్యాలయంలో సంఘం పీఐసీ చైర్మన్ తోటిరెడ్డి రాజేందర్ రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సంఘంలో రుణాలు తీసుకున్న రైతులు సకాలంలో వాయిదాలు చెల్లించాలని కోరారు. సహకార సంఘాల అభివృద్ధికి ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని, ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పాటుపడాలన్నారు. రైతులకు కావల్సిన ఎరువులు, విత్తనాలు, అందుబాటులో ఉంచి, వారికి కావాల్సిన సహాయ సహకారాలు అందించాలని కోరారు. ప్రాథమిక సహకార సంఘం అభివృద్ధికి రైతులంతా సహకరించాలన్నారు. రైతుల సంక్షేమమే సహకార సంఘం యొక్క లక్ష్యమని అన్నారు. సహకార సంఘాల ఆర్థికాభివృద్ధికి రైతులు సహకరించాలని కోరారు. అంతకుముందు సంఘం సీఈవో నాగరాజు మాట్లాడుతూ.. బ్యాంక్ సర్వసభ్య సమావేశానికి సంబంధించిన అంశాలను రైతులకు చదివి వినిపించారు. సంఘం అభివృద్ధికి సంబంధించిన విషయాలను రైతులకు వెల్లడించారు. సంఘం అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సమావేశంలో పీఐసీ పాలకవర్గ సభ్యులు కొండ మధుకర్ రెడ్డి, అంబోజు లక్ష్మయ్య, కంబాలపల్లి మల్లారెడ్డి, గోరిగే ఐలయ్య, మక్కపల్లి స్వరూప, కొండాపురం కళమ్మ, మద్దెల శశికళ, మల్కీజ్ గూడ గ్రామ సర్పంచ్ డేరంగుల శంకర్, సంఘం సీఈవో నాగరాజు, రైతులు, సహకార సంఘం బ్యాంక్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

కొండ్రు శివ రాములు : మేజర్ న్యూస్, యాచారం.