telanagana
పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా మహేంద్ర యూత్ సభ్యులు
సూర్య,భీమ్గల్ : భీమ్గల్ మండలం ముచ్కూర్ గ్రామానికి చెందిన మహేంద్ర యూత్ సభ్యులు పర్యావరణ పరిరక్షణలో ఆదర్శంగా నిలుస్తున్నారు. పర్యావరణహితమైన మట్టి వినాయకుడు, మట్టి దుర్గాదేవి విగ్రహాలను ప్రతిష్ఠిస్తూ ప్రజల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.పర్యావరణానికి హాని కలిగించే వస్తువులకు దూరంగా ఉంటూ, ప్రకృతికి మేలు చేసే మట్టి విగ్రహాలకు ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే అన్నదాన కార్యక్రమాల్లో ప్లాస్టిక్ ప్లేట్లకు బదులుగా స్టీల్ ప్లేట్లను వినియోగిస్తూ ప్లాస్టిక్ వ్యర్థాల నివారణకు తమ వంతు కృషి చేస్తున్నారు.యువతలో సామాజిక బాధ్యత, సేవాభావం పెంపొందించడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్న మహేంద్ర యూత్ సభ్యుల చర్యలను గ్రామస్తులు అభినందిస్తున్నారు.ప్రకృతిని కాపాడుతూ భావితరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందించాలనే వారి ప్రయత్నం అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది.