ఓట్ చోరీ పై ఇండియా ఓటమి ఆధ్వర్యంలో ఢిల్లీలో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
--ఓట్ చోరీపై ఇండియా కూటమి ఆందోళనలో డిల్లీ లో జరిగిన ర్యాలీ లో పాల్గొన్న నూతి సత్యనారాయణ గౌడ్
--ఛలో డిల్లీ - ప్రజాస్వామ్యం కోసం మార్చ్ పేరిట కనాట్ ప్లేస్ నుంచి సుప్రీంకోర్టు వరకు భారీ ర్యాలీలో కలిసి డిల్లీ వెళ్లిన జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్
ఖమ్మం సూర్య (మేజర్ న్యూస్)
ఏ ఐ సి సి అద్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, లోక్ సభ ప్రతి పక్షనేత రాహుల్ గాంధీ ఆదేశాలమేరకు రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి,ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు పిలుపు మేరకు డిల్లీ లో ర్యాలీ లో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు నూతి సత్యనారాయణ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
దేశవ్యాప్తంగా జరుగుతున్న ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీలతో కలిసి చేపట్టిన ఉద్యమం కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కాదని, దేశ పౌరుల ప్రాథమిక ఓటు హక్కును ,ప్రజాస్వామ్య వ్యవస్థను పరిరక్షించడానికి అని,రాష్ట్రపతి తో పాటు వివిధ రాజ్యాంగ వ్యవస్థల దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్ళిన అనంతరం న్యాయస్థానాల పరిధిలోని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇండియా కూటమి ఆధ్వర్యంలో శాంతియుత గాంధేయ మార్గంలో ఈ సత్యాగ్రహాన్ని నిర్వహిస్తున్నారని
ప్రజాస్వామ్యాన్ని,రాజ్యాంగ విలువను కాపాడుకొనేందుకు దేశ ప్రజలు అందరూ ఈ పోరాటానికి మద్దతు తెలపాలని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ సభ్యులు,శాసనసభ సభ్యులు,శాసనమండలి సభ్యులు,తెలంగాణ రాష్ట్ర ముఖ్య నాయకులు, రాష్ట్ర కార్పొరేషన్ ప్రస్తుత, మాజీ చైర్మన్లు, జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు వేజెండ్ల సాయి కుమార్ తదితర నాయకులు పాల్గొన్నారు.