నేటి నుండి రబీ శనగ విత్తనాల పంపిణీ
నేటి నుండి రబీ శనగ విత్తనాల పంపిణీ
రాయికోడ్, రబీ సీజన్‌కు సంబంధించి రైతులకు శనగ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం (అక్టోబర్ 12) నుంచి ప్రారంభించనున్నట్లు రాయికోడ్ మండల వ్యవసాయ అధికారి సారిక ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి విత్తనాల పంపిణీకి సంబంధించిన టోకెన్లు జారీ చేయనున్నట్లు పేర్కొన్నారు.ఒక్కో బ్యాగులో 25 కిలోల శనగ విత్తనాలు ఉంటాయని, ఒక్కో బ్యాగు ధర రూ.1,500గా నిర్ణయించినట్లు తెలిపారు. విత్తనాలు పొందాలనుకునే రైతులు ఆధార్ కార్డు జిరాక్స్, పట్టాదారు పాస్‌బుక్ జిరాక్స్ తప్పనిసరిగా తీసుకురావాలని సూచించారు.రెండు కేంద్రాల్లో టోకెన్ల జారీ
రాయికోడ్ రైతు వేదిక వద్ద వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈఓలు) నిఖిలేష్, అర్చనశ్రీ, కల్పన అందుబాటులో ఉంటారని తెలిపారు. ఇటికేపల్లి రైతు వేదిక వద్ద ఏఈఓలు శివకుమార్, మమత, లక్ష్మీకాంత్ రైతులకు టోకెన్లు జారీ చేస్తారని పేర్కొన్నారు.రాయికోడ్ మండలంలోని రైతులందరూ ఈ విషయాన్ని గమనించి, అవసరమైన ధృవపత్రాలతో సంబంధిత రైతు వేదికలకు హాజరై టోకెన్లు పొందాలని మండల వ్యవసాయ అధికారి సారిక కోరారు.