BREAKING
భైరవపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం... రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యాక్షన్ మోడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం! లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అపూర్వ ఎలిమినేషన్ తో బట్టబయలైన హౌస్‌మేట్స్ అసలు నైజం! కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి. 84 ఏళ్ల వయసులో రూ.4వేల కోట్ల సామ్రాజ్యం.. అమితాబ్ బచ్చన్ సక్సెస్ జర్నీ! మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ!

నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం

Select Suryaa Now
నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం

నందివాడ మండలంలో వైభవంగా శరన్నవరాత్రి ఉత్సవాలు: తొలిరోజు 'బాలాత్రిపురసుందరి'గా అమ్మవార్ల దర్శనం

నందివాడ, సూర్య ప్రతినిధి :

 నందివాడ మండలవ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి మహోత్సవాలు ఆదివారం నుండి అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. మండలంలోని పలు గ్రామాల్లో వెలసిన అమ్మవారి ఆలయాలన్నీ భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక రూపాన్ని సంతరించుకున్నాయి. ఉత్సవాల తొలిరోజైన ఆదివారం మండలంలోని ప్రధాన ఆలయాలలో అమ్మవార్లు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు.

జనార్ధనపురంలో కన్నులపండువగా ఉత్సవాలు:

మండలంలోనే ప్రసిద్ధిగాంచిన జనార్ధనపురం గ్రామంలో వేంచేసియున్న శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానములో శ్రీదేవి దివ్య శరన్నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వస్తిశ్రీ చాంద్రమాన శ్రీ పరాభవనామ సంవత్సర ఆశ్వీయుజ శుద్ధ పాడ్యమిని పురస్కరించుకుని ది. 11-10-2026 ఆదివారం నుండి 20-10-2026 మంగళవారం వరకు పది రోజుల పాటు ఈ ఉత్సవాలు కన్నులపండువగా జరగనున్నాయి.
తొలిరోజు ఆదివారం అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి అలంకారంలో భక్తులకు భక్తిభావం పెంపొందేలా దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వర్ణ శివశంకరరావు ఆధ్వర్యంలో శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, శ్రీ అన్నపూర్ణా అమ్మవారికి సహస్రనామ కుంకుమ పూజలు, విశేష అర్చనలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కె. వి. లక్ష్మి మాట్లాడుతూ.. ఉత్సవాల పది రోజులు నిత్యం స్వామివారికి అభిషేకాలు, అమ్మవారికి కుంకుమ పూజలతో పాటు ప్రతిరోజూ ఒక విశేష అలంకారం ఉంటుందని తెలిపారు. నందివాడ మండల భక్తులందరూ ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో పాల్గొని, స్వామి అమ్మవార్ల తీర్థప్రసాదాలు స్వీకరించి కృపకు పాత్రులు కావాలని కోరారు.

 

నందివాడ - సూర్య ప్రతినిధి(పాల్)