భైరవపాలెంలో అభివృద్ధి పనులకు శ్రీకారం... రూ.50 లక్షలతో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన.. ప్రభుత్వ విప్ ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు
కాట్రేనికోన మేజర్ న్యూస్ రిలయన్స్ ఆర్థిక సహాయంతో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవం ,ఐ. పోలవరం మండలం భైరవపాలెం గ్రామంలో ఈరోజు గౌరవ ప్రభుత్వ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు బుచ్చిబాబు పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా రూ.50 లక్షల వ్యయంతో చేపట్టనున్న రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రూ.15 లక్షల వ్యయంతో భైరవపాలెం రక్షిత మంచినీటి పథకం వద్ద ఏర్పాటు చేసిన మైక్రో ఫిల్టర్‌ను ప్రారంభించారు. అదేవిధంగా రిలయన్స్ సంస్థ ఆర్థిక సహాయంతో నిర్మించిన కమ్యూనిటీ హాల్‌ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూగ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. ప్రజలకు మెరుగైన రహదారి సౌకర్యాలు కల్పించడం, స్వచ్ఛమైన తాగునీటిని అందించడం లక్ష్యంగా అభివృద్ధి పనులు చేపడుతున్నామని పేర్కొన్నారు. రహదారుల నిర్మాణంతో గ్రామ ప్రజల రాకపోకలు సులభతరమవుతాయని, మైక్రో ఫిల్టర్ ద్వారా ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వంతో పాటు సామాజిక బాధ్యతగా ముందుకొచ్చే సంస్థల సహకారం కూడా ఎంతో ముఖ్యమని అన్నారు. రిలయన్స్ సంస్థ ఆర్థిక సహాయంతో కమ్యూనిటీ హాల్ అందుబాటులోకి రావడం గ్రామ ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.ముమ్మిడివరం నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ప్రజల అవసరాలను గుర్తించి అభివృద్ధి కార్యక్రమాలను దశలవారీగా చేపడతామని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు.ఈ కార్యక్రమంలో ఐ పోలవరం మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు గారు దాట్ల పృద్వి గారు స్థానిక ప్రజాప్రతినిధులు, కూటమి నాయకులు, అధికారులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.