శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారుకి పట్టు చీర సమర్పించిన చాట్రాతి కుటుంబ సభ్యులు
జీలుగుమిల్లి, మేజర్ న్యూస్: జీలుగుమిల్లి లో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ భవాని శేఖర్ కుటుంబ సభ్యులు పట్టు చీర సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. దసరా నవరాత్రుల సందర్భంగా శ్రీశ్రీ జగదాంబ అమ్మవారు బాల త్రిపుర సుందరిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆదివారం వేకువజామున అమ్మవారికి ఆలయ కమిటీ మాజీ చైర్మన్ చాట్రాతి భవాని శేఖర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు, కుల దైవంగా భావించే అమ్మవారికి గజమాల అలంకరించి సారే చీర సమర్పించారు, ఈ సందర్భంగా భవాని శేఖర్ మాట్లాడుతూ శ్రీ శ్రీ జగదాంబ అమ్మవారి కరుణ కటాక్షాలు గ్రామం పై ఉండాలని గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండేటట్లు చల్లని చూపు గ్రామంలోని ప్రతి కుటుంబం పై ఉండేటట్లు చూడాలని ఆజగన్మాతని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.
రిపోర్టర్ బంతు రామకృష్ణ జీలుగుమిల్లి ఏలూరు జిల్లా