BREAKING
గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు! త్రిపురాంతకం సీఐగా బాధ్యతలు స్వీకరించిన మాతంగి శ్రీనివాసరావు రౌడీ హీరో విజయ్ దేవరకొండ 'రణబాలి' నుంచి రెండో సింగిల్ వచ్చేసింది.. మ్యూజికల్ ట్రీట్‌తో అదరగొడుతున్న మేకర్స్! పేదలకు కొండంత అండ సీఎం సహాయనిది. 47,85,484 ప్రొఫైల్ చెక్కులు పంపిణీ చేసిన డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి ప్రతి గ్రామంలోనూ టీడీపీ జెండాను ఎగరవేయాలి.. టిడిపి సీనియర్ నాయకుడు రామ్మూర్తి నాయుడు న్యాయ పరిశోధనలో అత్యున్నత శిఖరం! ప్రొఫెసర్ డాక్టర్ గంట సత్యనారాయణ ఢిల్లీ పోలీసులపై సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దిప్కే సంచలన ఆరోపణలు బీసీల ఐక్యత విజయానికి సోపానం. దేవరయాంజాల్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక బతుకమ్మ: మంత్రి సీతక్క జిల్లా ఆర్యవైశ్య అధ్యక్షులుగా హరిప్రసాద్. బీసీలు రాజకీయంగా ఎదగవద్దా..? స్థానిక సంస్థల ఎన్నికలను ధైర్యంగా ఎదుర్కోవాలి: వైసీపీ నాయకుల పిలుపు శాంతి భద్రతలకు విఘాతం కల్పిస్తే కఠిన చర్యలు. రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ ఇచ్చిన సీఐ నాగమల్లేశ్వరరావు. నానా పటేకర్ మృతిపై వీడిన రహస్యం.. గుండెపోటు వల్లే మరణించినట్లు పోస్టుమార్టం నివేదికలో వెల్లడి!

ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం

Select Suryaa Now
ఎల్‌నినో ప్రభావంపై.. రైతులకు అవగాహన కార్యక్రమం

సోమవారం రైతు వేదికల్లో
సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యక్ష ప్రసారం

షాబాద్ : ఎల్‌నినో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో యాసంగి పంటల సాగుపై రైతులకు అవగాహన కల్పించేందుకు సోమవారం ఉదయం 10:30 గంటలకు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమాన్ని షాబాద్ మండలంలోని షాబాద్, మాచనపల్లి, తాళ్లపల్లి రైతు వేదికల్లో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు.ఈ కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎలుగంటి మధుసూదన్ రెడ్డి ముఖ్యఅతిథిగా, సర్దార్‌నగర్ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పీసరి సురేందర్ రెడ్డి, గుడిమల్కాపూర్ మార్కెట్ వైస్ చైర్మన్ కావలి చంద్రశేఖర్, షాబాద్ సర్పంచ్ గుండాల అశోక్ తదితరులు హాజరుకానున్నారు.
ఎల్‌నినో ప్రభావం, వర్షపాతం లోటు, వాతావరణ మార్పుల నేపథ్యంలో పంటల ఎంపిక, నీటి వనరుల సమర్థ వినియోగం, ప్రత్యామ్నాయ పంటల సాగు, వ్యవసాయంలో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, వాతావరణ నిపుణులు రైతులకు అవగాహన కల్పించనున్నారు.మండలంలోని సర్పంచులు, ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల సభ్యులు, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, రైతులు, మహిళా స్వయం సహాయక సంఘాల సభ్యులు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల డీలర్లు, మీడియా ప్రతినిధులు తమకు సమీపంలోని రైతు వేదికలకు చేరుకుని కార్యక్రమంలో పాల్గొనాలని మండల వ్యవసాయ అధికారి దండెం విజయచంద్ర కోరారు.

షాబాద్, మేజర్ న్యూస్ (అక్టోబర్ 11)