ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం
--ఖమ్మంలో మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శన ప్రారంభం
ఖమ్మం, సూర్య (మేజర్ న్యూస్): మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ ఖమ్మం షోరూంలో ప్రత్యేక బ్రాండెడ్ ఆభరణాల ప్రదర్శనను దొరేపల్లి శ్వేత , డాక్టర్ రాధిక , రజితలు ఘనంగా ప్రారంభించారు.అక్టోబర్ 11 నుంచి 20వ తేదీ వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని అన్నారు . ఈ ప్రదర్శనలో బంగారు , వజ్ర , రత్నాభరణాల ప్రత్యేక కలెక్షన్లను అందుబాటులో ఉంచారు . మైన్, ఎరా, ప్రెష్యా , ఎత్నిక్స్ , డివైన్ , స్టార్లెట్ బ్రాండ్ల ఆభరణాలు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి అని తెలిపారు . వివాహాలు , పార్టీలు , సంప్రదాయ వేడుకలకు అనువైన విభిన్న డిజైన్లను ప్రదర్శించబడ్డాయని పేర్కొన్నారు . ఈ సందర్భంగా స్టోర్ హెడ్ జితిన్ వి.కె. , స్టోర్ మేనేజర్ గుజ్జ కిషన్ రావు , అసిస్టెంట్ మేనేజర్లు విష్ణు , విజయ్ , మార్కెటింగ్ మేనేజర్ రుద్ర రామకృష్ణ లు మాట్లాడుతూ , వినియోగదారులకు పారదర్శక ధరలు , జీవితకాల ఉచిత నిర్వహణ వంటి సేవలు అందిస్తున్నట్లు తెలిపారు . రూ.20 వేలకుపైగా కొనుగోళ్లపై ఏడాది ఉచిత బీమా , జీవితకాల ఉచిత నిర్వహణతో పాటు , ఆభరణాల తరుగు చార్జీలపై 30 శాతం వరకు , వజ్రాభరణాల్లో వజ్రాల విలువపై 30 శాతం వరకు రాయితీలు అందిస్తున్నట్లు పేర్కొన్నారు . పాత బంగారానికి 100 శాతం విలువ , బంగారం మార్పిడిపై తరుగు లేకుండా సదుపాయం కల్పిస్తున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు , ఉన్నతాధికారులు , శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు .