BREAKING
క్యాన్సర్ వ్యాధి బారిన పడకుండా ప్రజల్లో అవగాహన పెంచాలి బీసీల రాజకీయ సాధికారతకు, సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది యాక్షన్ మోడ్‌లోకి జూనియర్ ఎన్టీఆర్.. 'డ్రాగన్' కొత్త షెడ్యూల్ ప్రారంభం! లిటిల్ ఫ్లాక్ లో ఘనంగా కృతజ్ఞతార్పణ పండుగ బిగ్‌బాస్‌లో ఊహించని ట్విస్ట్.. అపూర్వ ఎలిమినేషన్ తో బట్టబయలైన హౌస్‌మేట్స్ అసలు నైజం! కోటిపల్లిలో పర్యటించిన ఐజీ అశోక్ కుమార్ అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య అన్నవరప్పాడు శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులను పరిశీలించిన దేవాదాయ శాఖ కమిషనర్ శంకర్‌పల్లి, మోకిల పీఏసీఎస్‌లకు కొత్త పాలక మండళ్లు పర్యావరణ పరిరక్షణలో సేవలకు పుడమి నాయకులకు ప్రశంసలు పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌ నేరేడుచర్ల విద్యార్థులకు ప్రశంసా పత్రాల ప్రదానం చీమకుర్తి శ్రీ హరిహర క్షేత్రంలో వైభవంగా ప్రారంభం అయిన శ్రీ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలు. రోడ్లతోనే గ్రామీణాభివృద్ధి.. గ్రామమే దేశానికి మూల నిధి. 84 ఏళ్ల వయసులో రూ.4వేల కోట్ల సామ్రాజ్యం.. అమితాబ్ బచ్చన్ సక్సెస్ జర్నీ! మమితా బైజు క్రేజ్.. పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో గోల్డెన్ బ్యూటీ ఎంట్రీ! గణేశ్ ఆచార్య బయోపిక్ 'గణేశ్: డస్ట్ టు స్టార్‌డస్ట్'.. ట్రైలర్ విడుదల, రిలీజ్ డేట్ ఖరారు!

దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు

Select Suryaa Now
దుద్దెడ శంభులింగేశ్వర క్షేత్ర కోనేరు పునర్నిర్మాణానికి సన్నాహాలు

 

* ఆలయాన్ని సందర్శించిన పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి.

* చారిత్రక సంపదను కాపాడుకోవడం భక్తుల బాధ్యత

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన దుద్దెడ శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర స్వామి దేవాలయాన్ని శ్రీ గురు మదనానంద సరస్వతి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ మాధవానంద సరస్వతి స్వామి ఆదివారం దర్శించుకున్నారు. ఇటీవల కురిసిన  వర్షాలకు ఆలయ కోనేరు ఉత్తర భాగం గోడ కూలి శిథిలావస్థకు చేరిన నేపథ్యంలో, కోనేరు పునరుద్ధరణ పనులపై క్షేత్రస్థాయి పరిశీలన జరిపి భక్తులకు, ట్రస్టు సభ్యులకు మార్గదర్శనం చేశారు.గ్రామస్తులు, స్థానిక నాయకులు, భక్తులు కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకుంటూ త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు. ఈ బృహత్ పుణ్యకార్యానికి దాతలు, గ్రామస్తులందరూ విరాళాలు అందించి భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శ్రీ స్వయంభూ శంభులింగేశ్వర సేవా సమితి ట్రస్ట్ చైర్మన్ మంచాల శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి అనంతుల నరేందర్, ప్రతినిధులు వడ్లకొండ శ్రీనివాస్, పెద్ది కుమారస్వామి, అమిరిశెట్టి వెంకటేశం,ఆరెపల్లి మహాదేవు గౌడ్, మంచాల చిన్న శ్రీనివాస్, గొల్లపల్లి రఘురామ శర్మలతో పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు పాల్గొన్నారు

పాషా, సూర్య ప్రతినిధి