BREAKING
పంజాగుట్ట జివికె వన్ వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు ఆడపడుచులకు అండగా కళ్యాణ లక్ష్మి - 23 కుటుంబాల్లో ఆనందం కుటుంబానికి ఆర్థిక భరోసా ఇందిరమ్మ బీమా పథకం కాంగ్రెస్ నూతన ఇంచార్జ్ బి.ఎం.సందీప్‌ ను మర్యాదపూర్వకంగాకలిసిన పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్ అయ్యప్ప స్వామి మహాపడి పూజకు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్‌ కు ఆహ్వానం గల్ఫ్‌లో విదేశీ సైనిక బలగాలపై ఇరాన్ హెచ్చరిక.. నౌకా దళం విస్తరణకు దక్షిణ కొరియా సన్నాహాలు: తుర్కియే కీలక ఆమోదం.. పాకిస్థాన్, సౌదీ అరేబియాతో సంయుక్త రక్షణ ఒప్పందం అమలుకు మార్గం సుగమం: మహానది కోల్‌ఫీల్డ్స్ మార్కెట్‌లోకి ప్రవేశం.. ఇష్యూ ధర కంటే 2 శాతం తగ్గింపుతో షేర్ల నమోదు: భారత్–అమెరికా వాణిజ్య ఒప్పందానికి తుది మెరుగులు.. త్వరలోనే ఒప్పందం ఖరారవుతుందన్న పీయూష్ గోయల్ హిందూపురంలో ఘనంగా కనకదాసు జయంతి వేడుకలు.. భద్రాచలంలో ర్యాపిడో సేవలకు శ్రీకారం* సరంపేటలో ఉచిత వైద్య శిబిరం...! మానసిక ఒత్తిడితో సాఫ్ట్‌వేర్ ఉద్యోగిని ఆత్మహత్య పందిళ్లపల్లిలో ఆమంచి ఇంటి వద్ద ఉదృక్తత.. శీతాకాలంలో 10 ఏళ్ల లోపు పిల్లలకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ప్రముఖ చిన్నపిల్లల వైద్యులు శివకుమార్ సూచనలు

నలంద కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Select Suryaa Now
నలంద కళాశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

సూర్య, ఆదిలాబాద్‌: నలంద డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ బండారి అనూష సతీష్‌ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థినులతో కలిసి బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు. రంగురంగుల పూలతో పేర్చిన బతుకమ్మల నడుమ విద్యార్థినులు ఉత్సాహంగా వేడుకలు జరుపుకున్నారు.

ఈ సందర్భంగా అనూష సతీష్‌ మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బతుకమ్మ.. బతుకమ్మ అంటే తెలంగాణ అని అన్నారు. బతుకమ్మ పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. సంప్రదాయ పండుగలను యువత, విద్యార్థినులు ఉత్సాహంగా జరుపుకోవడం అభినందనీయమన్నారు. భావితరాలకు తెలంగాణ సంస్కృతిని అందించడంలో బతుకమ్మ పండుగ కీలకమని తెలిపారు.

మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో బతుకమ్మ సంబరాలను మరింత ఘనంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని, ముందస్తు అజెండాలో ఈ వేడుకలకు ప్రాధాన్యం కల్పించి ప్రజలు, మహిళలు, యువత పెద్దఎత్తున పాల్గొనేలా అవసరమైన సౌకర్యాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్‌ పున్నారావు, అధ్యాపకులు నర్సింగ్‌, రవళి, కళాశాల సిబ్బంది, విద్యార్థినులు పాల్గొన్నారు.